క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్-2024 సెకెండ్ ఫేజ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజుల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు.
రెండో దశ మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగనున్నట్లు జై షా సృష్టం చేశారు. "ఈ ఏడాది సీజన్ మొత్తం ఇండియాలోనే జరగనుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదని" క్రిక్‌బజ్‌తో జైషా పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే తొలి ఫేజ్ షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. తొలి దశలో కేవలం 22 మ్యాచ్‌లకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే మరోవారంలో పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేయనుంది.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment