Varanasi International Cricket Stadium: ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండుల్కర్ కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాడు. స్వామివారికి అభిషేకం చేసి భక్తిభావం చాటుకున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రాత్మక నగరం వారణాసిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం నిర్మించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సమాయత్తమైన విషయం తెలిసిందే.
కాశీ విశ్వేశ్వరుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరంలో శివతత్వం ఉట్టిపడేట్లుగా సీటింగ్ స్థలం అర్ధ చంద్రాకారంలో.. ఫ్లడ్‌లైట్స్ త్రిశూలాన్ని స్ఫురించేలా.. ఎంట్రీ ఢమరుకాన్ని పోలి ఉండేలా నిర్మించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఈ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు.
కాశీ విశ్వనాథునిరి టీమిండియా దిగ్గజాల అభిషేకం
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు.. వరల్డ్‌కప్ విజేతలు కపిల్ దేవ్, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్ ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి విశ్వనాథుని దర్శించుకుని పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా వారణాసి స్టేడియం నిర్మాణం డిసెంబరు 2025 నాటికి పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో యూపీలోని లక్నోలో గల భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం తర్వాత మూడో స్టేడియంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. వారణాసి స్టేడియం నిర్మాణానికి సుమారు 451 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
#WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi
— ANI (@ANI) September 23, 2023
(Video source - PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR
Comments
Please login to add a commentAdd a comment