క్వాలిఫయర్-2లో ముంబైపై సెంచరీతో అదరగొట్టిన గిల్ (PC: IPL)
IPL 2023- Shubman Gill: ‘‘సునిల్ గావస్కర్ వచ్చాడు... అదరగొట్టాడు.. తర్వాత సచిన్ టెండుల్కర్.. అనంతరం రాహుల్ ద్రవిడ్.. అటు పిమ్మట వీవీఎస్ లక్ష్మణ్.. వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి... ఇలాగే అద్బుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.
శుబ్‌మన్ గిల్ కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు’’ అంటూ టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్.. టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్‌పై ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పుడే గిల్ ఆట తీరుపై పూర్తి అంచనాకు రాలేమని వచ్చే సీజన్‌లోనూ ఇలాగే ఆడితే అతడికి తిరుగు ఉండదని పేర్కొన్నాడు.
ఏకంగా మూడు సెంచరీలు
కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ సెంచరీలతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్‌లలో 851 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా మూడు శతకాలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇప్పటి వరకు గిల్ బాదిన బౌండరీల సంఖ్య 78. సిక్సర్లేమో 33. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న గిల్.. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా అవతరించాడు. పరుగుల వరద పారించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక ఆదివారం నాటి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై మరోసారి చెలరేగితే గిల్‌కు తిరుగుండదు.
అద్భుత ఆటగాడే కానీ..
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ ఆట తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో కపిల్ దేవ్.. గిల్‌ను కొనియాడుతూనే.. ఆటలో నిలకడ అవసరమని పేర్కొన్నాడు. ‘‘గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
అతడిలో అపారమైన ప్రతిభ దాగుంది. బ్యాటింగ్‌లో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలకు కొదువలేదు. అయితే, తను ఆటలో ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. రానున్న సీజన్‌లో కూడా ఇదే నిలకడైన ఆట తీరు కొనసాగిస్తే అతడిని అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో చేర్చడం ఖాయం.
ఇప్పుడే వద్దు
కాబట్టి నేను ఇప్పుడే గిల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేను. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత తన గురించి మాట్లాడతా. ఇప్పుడే గొప్ప ప్లేయర్ అంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుంది’’ అని కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్‌తో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా సీఎస్‌కే- గుజరాత్ ఐపీఎల్-2023 ట్రోఫీ కోసం ఆదివారం తలపడనున్నాయి.
చదవండి: చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు!
ఒకవేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్ విజేత ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment