భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా అండగా నిలిచాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలవు తీసుకోవడం అతడి హక్కు అంటూ కోహ్లి నిర్ణయాన్ని సమర్థించాడు.
కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాటర్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా తొలి మ్యాచ్‌లో ఓడినా.. రెండో టెస్టులో గెలిచింది. తిరిగి పుంజుకుని సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసి.. రాజ్‌కోట్‌లో మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఈ కీలక సిరీస్‌కు దూరం కావడానికి గల కారణం ఇంత వరకు వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లి భార్య అనుష్క శర్మ గర్భవతి అని, ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగానే విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
అయితే, బీసీసీఐ మాత్రం ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు కోహ్లి అందుబాటులో లేడని ప్రకటించిన సమయంలో.. అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. తాజాగా ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు.
రాజ్‌కోట్ టెస్టు ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన క్రమంలో ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఒక వ్యక్తి.. తన పదిహేనేళ్ల కెరీర్‌లో వ్యక్తిగత కారణాలు చూపి సెలవు అడగటం అతడి హక్కు.
విరాట్ కారణం లేకుండా సెలవు అడిగే వ్యక్తి కాదు. మా ఆటగాడిపై మాకు నమ్మకం ఉంది. మేము కచ్చితంగా అతడికి అండగా ఉంటాం’’ అని జై షా స్పష్టం చేశాడు. అదే విధంగా.. టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లి ఆడతాడా లేదా అన్న అంశం గురించి ప్రస్తావన రాగా.. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశాడు.
అయితే, ఈ ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని జై షా స్పష్టం చేశాడు. కాగా ఇషాన్ కిషన్ మానసికంగా అలసిపోయానంటూ సెలవు తీసుకుని.. విదేశాల్లో పర్యటించడం.. కోచ్ రంజీల్లో ఆడమని చెప్పినా ఆడకపోవడం వంటి అంశాలపై బీసీసీఐ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. జై షా.. కోహ్లి సెలవుల గురించి ఇలా కామెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు.. ఇషాన్ పేరెత్తకుండానే చీఫ్ సెలక్టర్, కోచ్, కెప్టెన్ చెప్పిన మాట వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు జై షా!
చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై
Comments
Please login to add a commentAdd a comment