
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్‌క్లే తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆగష్టు 20న ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే రెండు దఫాలుగా చైర్మన్‌గా వ్యవహరించిన గ్రెగ్ బార్‌క్లే.. మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని జై షా భర్తీ చేశారు. ఐసీసీలోని మొత్తం పదహారు మంది సభ్యుల్లో 15 మంది జై షాకు అనుకూలంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
సరికొత్త రికార్డు
ఇక నవంబరు 30న బార్‌క్లే పదవీకాలం ముగియనుండగా... ఆ మరుసటి రోజు జై షా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల జై షా సరికొత్త రికార్డు సాధించారు. అత్యంత పిన్న వయసులో ఐసీసీ బాస్‌గా నియమితులైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
కాగా జై షా ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామం నేపథ్యంలో ఆయన త్వరలోనే బీసీసీఐ పదవి నుంచి వైదొలగనున్నారు. ఇక ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం తనకు దక్కిన గొ ప్ప గౌరవం అని జై షా హర్షం వ్య క్తం చేశారు.
జై షాకు హెచ్‌సీఏ శుభాకాంక్షలు
ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు శుభాకాంక్షలు
తెలిపారు. జైషా నాయకత్వంలో ప్రపంచ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
చదవండి: లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్‌బై!.. రేసులో ఆ ఇద్దరు!
Jay Shah has been elected unopposed as the next Independent Chair of the ICC.https://t.co/Len6DO9xlE
— ICC (@ICC) August 27, 2024