టీమిండియా హెడ్‌ కోచ్‌గా డివిలియర్స్‌?.. హింట్‌ ఇచ్చిన ఏబీడీ | Team India Next Head Coach: AB de Villiers On Replacing Dravid Think Will Enjoy But | Sakshi
Sakshi News home page

టీమిండియా హెడ్‌ కోచ్‌గా డివిలియర్స్‌?.. హింట్‌ ఇచ్చిన ఏబీడీ.. కామెంట్స్‌ వైరల్‌

Published Sat, May 25 2024 12:45 PM | Last Updated on Sat, May 25 2024 1:11 PM

Team India Next Head Coach: AB de Villiers On Replacing Dravid Think Will Enjoy But

ఏబీ డివిలియర్స్‌ (PC: BCCI)

రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎవరన్న అంశంపై క్రికెట్‌ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. విదేశీ కోచ్‌లకు కూడా తలుపు తెరిచే ఉన్నాయంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో పలువురు మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చాయి.

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం రిక్కీ పాంటింగ్‌, మాజీ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, ఆర్సీబీ కోచ్‌ ఆండీ ఫ్లవర్ తదితరులు టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రిక్కీ, లాంగర్‌ తాము ఈ పదవి పట్ల ఆసక్తిగా లేమని చెప్పగా.. జై షా సైతం తాము ఎవరికీ ఇంకా ఆఫర్‌ ఇవ్వలేదంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఆఫర్‌ వస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నాకైతే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనా లేదు.

అయితే, ఏదేని జట్టుకు కోచింగ్‌ ఇవ్వడాన్ని నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో.. నన్ను ఇబ్బంది పెట్టే అంశాలు కూడా కొన్ని ఉంటాయన్న విషయం మర్చిపోవద్దు.

నాకు తెలియని విషయాలను కూడా త్వరత్వరగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కోచ్‌గా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.

40 ఏళ్ల వయసులో.. ఇప్పుడు నేను పూర్తి పరిణతి చెందిన వ్యక్తిని. నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమేం జరిగాయో అన్న దానిపై మరింత స్పష్టత వచ్చింది. ​చాలా పాఠాలు నేర్చుకున్నాను.

కొంత మంది యువ ఆటగాళ్లకు.. మరికొంత మంది సీనియర్లకు కూడా నా అనుభవం ఉపయోగపడవచ్చు. కొంత మంది ఆటగాళ్లతో.. కొన్ని జట్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

కానీ పూర్తిస్థాయిలో హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు ఇది సరైన సమయం కాదనుకుంటున్నా. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నా. అయితే, ముందుగా చెప్పినట్లు కోచ్‌ మారడానికి నేనెప్పుడూ నో చెప్పను. పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా!’’ అని ఏబీ డివిలియర్స్‌ న్యూస్‌18తో పేర్కొన్నాడు.

భవిష్యత్తులో తనను కోచ్‌ అవతారంలో తప్పక చూస్తారనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఏబీ డీ అభిమానులు క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే టీమిండియా హెడ్‌కోచ్‌గా వచ్చేయమంటూ సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ సైతం వచ్చే ఏడాది డివిలియర్స్‌ తమ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా రావడం ఖాయమని ఫిక్సయిపోతున్నారు.

చదవండి: SRH Captain Pat Cummins: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్‌ప్రైజ్‌.. ఇంకొక్క అడుగు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement