IPL Media Rights Tender In Auction To Be Held On June 12 - Sakshi
Sakshi News home page

BCCI: ఐపీఎల్‌ మీడియా హక్కుల టెండర్లకు ఆహ్వానం.. వేలం ఎప్పుడంటే..? 

Published Wed, Mar 30 2022 5:26 PM | Last Updated on Wed, Mar 30 2022 9:32 PM

IPL Media Rights Tender Out, Auction To Be Held On June 12 - Sakshi

pic credit: cricbuzz

BCCI-IPL Media Rights: రాబోయే  ఐదేళ్ల (2023-2027) కాలానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఈ-టెండర్లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్‌ చేస్తూ బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 12న వేలం నిర్వహించనున్నట్లు షా స్పష్టం చేశారు. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా ఉన్న  స్టార్ స్పోర్ట్స్‌తో ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుండటంతో టెండర్లకు పిలుపునిచ్చినట్లు షా పేర్కొన్నారు.  

ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు రావడం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ గతంతో పోల్చితే దాదాపు పదింతలు పెరగడం.. ఫ్రాంచైజీలు భారీగా డబ్బులు ఖర్చు చేసి ఆటగాళ్లను దక్కించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ టెండర్ల ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ పరిధి పెరిగిన నేపథ్యంలో మీడియా హక్కులను దక్కించుకునేందుకు జీ-సోనీ, రిలయన్స్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.  
చదవండి: IPL: క్రిస్‌ గేల్‌ వచ్చేస్తున్నాడు..!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement