
ఆసియాకప్-2023కు మరో 10 రోజుల్లో తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా ఆగస్టు 30న జరగనున్న పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఆసియాకప్ ఓపెనింగ్ మ్యాచ్‌కు హాజరు కావల్సిందగా బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షాకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పంపింది. అదే విధంగా డర్బన్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ కూడా మౌఖికంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య జైషా పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాగా వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సింది. కానీ పాకిస్తాన్‌కు తమ జట్టును పంపేందుకు బీసీసీఐ నిరరారించడంతో ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించకుంది.
ఈ మెగా ఈవెంట్‌లో శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా జరగనుంది. ఈ టోర్నీలోని నాలుగు మ్యాచ్‌లు మాత్రమే పాకిస్తాన్‌లో జరగనుండగా.. మిగితా మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. ఈ ఈవెంట్ కోసం పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తమ జట్లను ప్రకటించగా.. భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో వెల్లడించే ఛాన్స్ ఉంది.
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment