IPL: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ సెక్రెటరీ జై షా శుభవార్త తెలిపాడు. రానున్న సీజన్ల నుంచి ఐపీఎల్ పండుగను రెండున్నర నెలలకు పెంచబోతున్నట్లు స్పష్టం చేశాడు. క్యాష్ రిచ్ లీగ్‌ను 10 వారాల పాటు నిర్వహించేందుకు ఐసీసీ కూడా అంగీకరించిందని వెల్లడించాడు. మంగళవారం ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన షా.. రానున్న సీజన్‌లలో క్రికెట్ పండుగ కాలవ్యవధి మరింత పెరుగనుందని కన్ఫర్మ్ చేశాడు.
అయితే కొత్త ఫ్రాంచైజీలను ఇప్పట్లో తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని, ఉన్న జట్లతోనే మ్యాచ్‌ల సంఖ్యను, ఆటగాళ్ల సంఖ్యను మరింత పెంచదలచుకున్నామని వివరించాడు. 2024-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు ఐసీసీ వచ్చే వారం సమావేశం కానుందని, ఈ సమావేశాల్లో ఐపీఎల్ విండోపై పూర్తి క్లారిటీ వస్తుందని పేర్కొన్నాడు.
కాగా, ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరగడంతో క్యాష్ రిచ్ లీగ్ రెండు నెలల పాటు సాగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో మ్యాచ్‌ల సంఖ్య 74కు పెరగగా.. రానున్న సీజన్‌లలో ఈ సంఖ్య 94కు పెరిగే అవకాశం ఉంది.
చదవండి: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
Comments
Please login to add a commentAdd a comment