బీసీసీఐ కార్యదర్శి జై షా
No Bio Bubble: టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఊరటనిచ్చే వార్త చెప్పారు. దేశంలో బయో బబుల్‌లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్-2022 అని ధ్రువీకరించారు. భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో బయో బబుల్ నుంచి ఆటగాళ్లకు విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కాగా కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా రెండేళ్ల నుంచీ క్రికెటర్లు బయో బబుల్‌లోనే గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది కఠిన నిబంధనలు తట్టుకోలేక తీవ్ర ఒత్తిడికి గురై పలు టోర్నీల నుంచి తప్పుకొన్నారు కూడా.ఈ నేపథ్యంలో జై షా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి ఐపీఎల్-2022తో బయో బబుల్ విధానం ముగుస్తుంది. టీమిండియా- సౌతాఫ్రికా సిరీస్ నుంచి ఇది ఉండబోదు.
అయితే, ఆటగాళ్లకు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తాం’’ అంటూ క్రికెటర్లకు గుడ్‌న్యూస్ అందించారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంజీ ట్రోఫీ వంటి దేశీ టోర్నీలు కూడా గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించనుంది.
జూన్ 9న మొదటి మ్యాచ్ జరుగనుండగా.. జూన్ 19 నాటి మ్యాచ్‌తో సిరీస్ ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరోవైపు మే 29న గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ పోరుతో ఐపీఎల్-2022 ముగియనుంది.
చదవండి 👇
IPL 2022 Final: అతడిని తుది జట్టు నుంచి తప్పించండి.. అప్పుడే: టీమిండియా మాజీ బ్యాటర్
IPL 2022 Prize Money: ఐపీఎల్ విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment