Bio Bubble
-
'ఆ భారత క్రికెటర్లు మొత్తం సిరీస్‌నే రిస్క్‌లో పెట్టారు'
2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టీమిండియా అత్యున్నతమైన టెస్టు సిరీస్ విజయాల్లో ఇది ఒకటి. విరాట్ కోహ్లి సారథ్యంలో భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. ఆడిలైడ్ వేదికగా జరగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. తొలి టెస్టు అనంతరం వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ కోహ్లి తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ఆజింక్యా రహానే చేపట్టాడు. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడిలైడ్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టుకు ముందు హై డ్రామా నడిచింది. కొంతమంది భారత ఆటగాళ్లు బయో బబుల్‌ను ఉల్లంఘించి రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఈ విషయం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే రెస్టారెంట్‌కు వెళ్లిన ఆటగాళ్ల అందరికి కొవిడ్ పరీక్షలలో నెగిటివ్ తేలడంతో మూడు టెస్టుకు అందుబాటులో ఉన్నారు. తాజాగా వూట్ అనే ప్లాట్‌ఫామ్.. ఆస్ట్రేలియా-భారత్ సిరీస్‌ను‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించింది. అయితే తాజాగా ఇదే విషయంపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మరోసారి గుర్తుచేశాడు. "నలుగురు, ఐదుగురు భారత ఆటగాళ్లు మొత్తం టెస్ట్ సిరీస్‌ను రిస్క్‌లో పెట్టారు. వారు ఫుడ్ కోసం వెళ్లారో ఎందుకోసం వెళ్లారో నాకు తెలియదు గానీ, కాస్త నిజాయితీగా వ్యవహరించి ఉంటే బాగుండేది" అని టిమ్ పైన్ పేర్కొన్నాడు. ఇక ఇదే విషయంపై పాట్ కమిన్స్ మాట్లాడూతూ.. "భారత క్రికెటర్లు అలా చేయడం మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లకి చికాకు కలిగించింది. ఎందుకంటే వారి కుటుంబాలతో క్రిస్మస్ సంబరాలు జరపుకోకుండా ఈ సిరీస్‌కు బయోబబ్లలో ఉన్నారు. మా జట్టు అన్నిటిని త్యాగం చేసి ఈ సిరీస్‌కు సిద్దమైంది. అయితే పర్యటక జట్టు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు" అని పాట్ కమిన్స్ తెలిపాడు. కాగా ఈ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. చదవండి: Tim Paine Thanks Rahane: 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' -
Ind Vs SA: టీమిండియా క్రికెటర్లకు శుభవార్త చెప్పిన జై షా.. ఇక నుంచి..
No Bio Bubble: టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఊరటనిచ్చే వార్త చెప్పారు. దేశంలో బయో బబుల్‌లో ఆడే చివరి టోర్నీ ఐపీఎల్-2022 అని ధ్రువీకరించారు. భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో బయో బబుల్ నుంచి ఆటగాళ్లకు విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా రెండేళ్ల నుంచీ క్రికెటర్లు బయో బబుల్‌లోనే గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది కఠిన నిబంధనలు తట్టుకోలేక తీవ్ర ఒత్తిడికి గురై పలు టోర్నీల నుంచి తప్పుకొన్నారు కూడా.ఈ నేపథ్యంలో జై షా టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి ఐపీఎల్-2022తో బయో బబుల్ విధానం ముగుస్తుంది. టీమిండియా- సౌతాఫ్రికా సిరీస్ నుంచి ఇది ఉండబోదు. అయితే, ఆటగాళ్లకు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తాం’’ అంటూ క్రికెటర్లకు గుడ్‌న్యూస్ అందించారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంజీ ట్రోఫీ వంటి దేశీ టోర్నీలు కూడా గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించనుంది. జూన్ 9న మొదటి మ్యాచ్ జరుగనుండగా.. జూన్ 19 నాటి మ్యాచ్‌తో సిరీస్ ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరోవైపు మే 29న గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ పోరుతో ఐపీఎల్-2022 ముగియనుంది. చదవండి 👇 IPL 2022 Final: అతడిని తుది జట్టు నుంచి తప్పించండి.. అప్పుడే: టీమిండియా మాజీ బ్యాటర్ IPL 2022 Prize Money: ఐపీఎల్ విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే! -
ఇండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్
IND VS SA T20 Series 2022: ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ సిరీస్‌ను బయో బబుల్ లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుడగ వాతావరణంలో ఆటగాళ్లు గత రెండేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్న కారణంగా ఈ నిబంధనలను ఎత్తి వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ప్రముఖ వార్తా సంస్థకు వెల్లడించారు. దేశవాళీ టోర్నీల్లో బయోబబుల్‌ను ఎత్తి వేస్తున్నట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ జూన్ 19 వరకు జరుగనుంది. ఢిల్లీ (జూన్ 9న తొలి టీ20), కటక్ (జూన్ 12న రెండో టీ20), వైజాగ్ (జూన్ 14న మూడో టీ20), రాజ్‌కోట్ ఝ(జూన్ 17న నాలుగో టీ20), బెంగళూరు (జూన్ 19న ఐదో టీ20) వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!
BCCI: భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ శుభవార్త వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న బుడగ (బయో బబుల్) నిబంధనలను ఎత్తి వేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుడగ నిబంధనల వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో కోవిడ్ ప్రభావం కూడా తగ్గుముఖం పడతుండడంతో బయో బబుల్ నిబంధనలకు పూర్తిగా స్వస్థి పలకాలని బీసీసీఐ యోచిస్తుంది. దీంతో ఈ నెల (ఏప్రిల్) నుంచే ఆటగాళ్లకు బుడగ నిబంధనల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వెసులుబాటు దేశవాళీ క్రికెటర్లకు మాత్రమేనని తెలుస్తోంది. త్వరలో రెండు దేశవాళీ టోర్నీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో పాటు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: శతక్కొట్టిన ఆర్సీబీ.. అంబరాన్నంటిన సంబురాలు -
బుడగ దాటితే బంతాటే..! కఠినమైన బయోబబుల్ రూల్స్‌ను అమల్లోకి తేనున్న బీసీసీఐ
IPL 2022 Bio Bubble Rules: మరో పది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 15వ సీజన్ కోసం బీసీసీఐ కఠినమైన బయో బబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. ఎవరైనా ఆటగాడు బుడగ దాటితే తొలిసారికి ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్, రెండో ఉల్లంఘనకు ఓ మ్యాచ్ నిషేధం, మూడోసారి బుడగ దాటితే ఏకంగా లీగ్ నుంచే గెంటివేత తప్పదని గట్టిగా హెచ్చరించింది. ఈ పరిస్థితి ఎదురైతే, ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా అనుమతించరని పేర్కొంది. ఇక, ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ఎవరైనా ఆటగాడు/ ఫ్రాంచైజీ సభ్యుడు తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ. కోటి జరిమానా, రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బయోబబుల్ నిబంధనలు ఫ్రాంచైజీలు, సభ్యుల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని.. కుటుంబ సభ్యుల మొదటి ఉల్లంఘనకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ (ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజుల క్వారంటైన్లో గడపాల్సిందే), రెండో సారికి బుడగ నుంచి తొలగిస్తారని వివరించింది. దీంతో పాటు కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు, రెండోసారికి రూ. 75వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతి నిరాకరణ ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. చదవండి: ఐపీఎల్లో సరికొత్త రూల్స్.. ఇకపై! -
విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు
Team India Arrives In Ahmedabad ODI Series Against West Indies: ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియా అహ్మదాబాద్‌కు చేరుకుంది. జట్టు సభ్యులందరూ ఇవాళ బయో బబుల్‌లోకి వెళ్లారు. వీరంతా మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. జట్టు సభ్యులు అహ్మదాబాద్‌కు బయలుదేరిన ఫోటోను టీమిండియా స్పిన్నర్ చహల్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. శిఖర్ ధవన్‌తో కలిసి విమానంలో కూర్చున్న సందర్భంలో చహల్ ఫొటోకు ఫోజ్ ఇచ్చాడు. Ahemdabad ✈️🇮🇳 pic.twitter.com/oNqUDb7QUa — Yuzvendra Chahal (@yuzi_chahal) January 30, 2022 కాగా, విండీస్‌తో 3 వన్డేలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న తొలి వన్డే, 9న రెండోది, 11న మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో 3 టీ20లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌లో జరగనున్నాయి. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయిన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. చదవండి: అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్ -
ప్రేక్షకుల్లేకుండానే... భారత్, దక్షిణాఫ్రికా సిరీస్
జొహన్నెస్‌బర్గ్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదని ప్రకటించింది. ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు సహా మున్ముందు జరిగే ఇతర మ్యాచ్‌లకు కూడా అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచడం లేదని సీఎస్ఏ వెల్లడించింది. ఇరు జట్ల మధ్య పోరులో భాగంగా 3 టెస్టులు, 3 వన్డేలు జరగనున్నాయి. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న అభిమాలను గరిష్టంగా 2 వేల మంది వరకు అనుమతించే అవకాశం ఉన్నా... ఆటగాళ్ల భద్రత, బయో బబుల్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల తమ దేశంలో శ్రీలంక, పాకిస్తాన్లతో జరిగిన సిరీస్‌లను కూడా ప్రేక్షకుల్లేకుండానే సీఎస్ఏ నిర్వహించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా ‘ఫోర్త్ వేవ్’ కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం రెండు టెస్టులకు వేదికలైన సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్ నగరాలు ఉన్న గ్వాటంగ్ ప్రొవిన్స్‌లో ఉన్నాయి. -
'ఆ విషయంలో' రవిశాస్త్రి వ్యాఖ్యలను సమర్ధించిన పాకిస్థాన్ కెప్టెన్
Babar Azam Supports Ravi Shastri Comments On Bio Bubble: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా ప్రస్థానం ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి వీడ్కోలు పలికిన రవిశాస్త్రి బయోబబుల్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా బయోబబుల్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫిజికల్‌గా, మెంటల్‌గా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్ బోర్డులు, అభిమానులు గుర్తించాలని.. పెట్రోల్ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు యంత్రాలు కాదని రవిశాస్త్రి చేసిన సంచలన వ్యాఖ్యలపై పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ స్పందించాడు. Sometimes the most productive thing you can do is relax. 🧘 pic.twitter.com/gKgJv6PWif — Babar Azam (@babarazam258) November 9, 2021 బయోబబుల్‌లో ఆటగాళ్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి విషయంలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధిస్తానని అన్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి హెచ్చుతగ్గులు సాధారణమే అయినప్పటికీ.. ఎక్కువ కాలం బయో బుడగలో ఉండటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అసౌకర్యానికి గురవుతారని పేర్కొన్నాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలని.. క్రికెట్ బోర్డులు ఈ విషయంలో పునరాలోచించాలని, బిజీ షెడ్యూల్‌ను ఉద్ధేశిస్తూ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లకు విశ్రాంతి తీసుకోవడం కంటే గొప్ప పని మరొకటి ఉండదని అభిప్రాయపడ్డాడు.పాక్ ఆటగాళ్లు సైతం గతేడాది కాలంగా నిరంతర బయో వాతావరణంలో ఉండడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయారని.. అయితే తామంతా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొందామని తెలిపాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో సెమీస్ సమరానికి ముందు మీడియా ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పాక్ సారధి ఈ మేరకు స్పందించాడు. చదవండి: 'సెమిఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు'