విండీస్‌తో సిరీస్‌కు రెడీ.. బయో బబుల్‌లోకి వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు | Team India Arrives In Ahmedabad Ahead Of ODI Series Against West Indies | Sakshi
Sakshi News home page

IND Vs WI ODI Series: అహ్మదాబాద్‌ చేరుకున్న టీమిండియా

Published Mon, Jan 31 2022 9:15 PM | Last Updated on Mon, Jan 31 2022 10:17 PM

Team India Arrives In Ahmedabad Ahead Of ODI Series Against West Indies - Sakshi

Team India Arrives In Ahmedabad ODI Series Against West Indies: ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా అహ్మదాబాద్‌కు చేరుకుంది. జట్టు సభ్యులందరూ ఇవాళ బయో బబుల్‌లోకి వెళ్లారు. వీరంతా మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. జట్టు సభ్యులు అహ్మదాబాద్‌కు బయలుదేరిన ఫోటోను టీమిండియా స్పిన్నర్‌ చహల్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. శిఖర్ ధవన్‌తో కలిసి విమానంలో కూర్చున్న సందర్భంలో చహల్‌ ఫొటోకు ఫోజ్‌ ఇచ్చాడు. 


కాగా, విండీస్‌తో 3 వన్డేలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న తొలి వన్డే, 9న రెండోది, 11న మూడో వన్డే జరగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో 3 టీ20లు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డన్స్‌లో జరగనున్నాయి. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయిన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్ శర్మ ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 
చదవండి: అరుదైన ఫీట్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement