బెంగళూరు: కర్ణాటకలోని సిర్సి తాలూకాలో దట్టమైన అడవిలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. మార్గమధ్యలో ఓ చోట అనేక బండరాళ్లు దర్శనమిస్తాయి. పరీక్షించి చూస్తే రాళ్లపై శివలింగాలు కనిపిస్తాయి. పదులు, వందలు కాకుండా వేల సంఖ్యలో శివ లింగాలు చెక్కి ఉంటాయి. 2011లో పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యటించడంతో ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ గాలి వార్త తెగ చక్కర్లు కొడుతోంది. "దేశ చరిత్రలోనే తొలిసారిగా లక్ష లింగాల పుణ్యక్షేత్రం బయటపడింది. కర్ణాటకలోని శివకాశీ నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ఈ లింగాలు దర్శనమిచ్చాయి. మన సనాతన సంస్కృతికి ఇవే రుజువు. హిందువులారా మేల్కొనండి, హిందువులమని గర్వించడి" అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. (సైకిల్ గర్ల్‌పై అత్యాచారం, హత్య: నిజమెంత?)
(ఫొటో: ఏన్సెంట్ పేజెస్)
ఇందులో కొంత నిజం, కొంత అబద్ధం కలగలిసి ఉంది. ఇక్కడ 1000 శివలింగాలున్నాయి కానీ వాట్సాపుల్లో చెప్తున్నట్లుగా లక్ష లింగాలు లేవు. కర్ణాటకలోని షాల్మలా నదీ ప్రాంతంలో ఉన్న ఈ శివలింగాలు పర్యాటకానికి కూడా ప్రసిద్ధి చెందాయి. క్రీ.శ. 1678-1718 కాలంలో సిర్సి రాజు అరసప్ప నాయక్ ఈ లింగాలను చెక్కించినట్లు ఉత్తర కన్నడ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అదీగాక తొమ్మిదేళ్ల క్రితమే ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి ప్రతియేటా శివరాత్రికి వేలాదిమంది భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుని శివయ్యను స్మరించుకుంటారు. (‘రావణుడి’పై అసత్య ప్రచారం)
నిజం: ఇది కొత్తగా బయటపడ్డ ప్రదేశం కాదు. ఇక్కడ వెయ్యి శివలింగాలు మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment