మహా శివలింగానికి అభిషేకాలు
కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్న మహా శివలింగానికి 108 కిలోల పెరుగుతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు గుండేటి రజినీ కుమార్, మార్త ఓంప్రకాష్‌లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శివలింగానికి అన్నాభిషేకం చేశారు. పూజల్లో కార్పొరేటర్ బయ్యస్వామి, ఆలయ కమిటీ ప్రతినిధులు గోనె జగదీశ్వర్, సంతోష్, బోడకుంట్ల వైకుంఠం, ఓరుగంటి కొమురయ్య, రమేష్, సాంబారి ఉప్పలయ్య, భాస్కర్, కృష్ణమూర్తి, మండల శ్రీరాములు, భక్తులు పాల్గొన్నారు.