ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో నీవెవరో పేరుతో థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా హరినాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది.. అంధుడిగా కనిపించనున్నాడన్న వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మళయాల సూపర్ హిట్ అదే కంగల్ (అవే కళ్లు) సినిమా ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఒరిజినల్ వర్షన్‌లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట.
రొమాంటిక్ యాక్షన్‌థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా రీమేక్ అన్న విషయాన్ని ధృవీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment