Media Fires On Actress Ritika Singh At In Car Movie Promotions, Reason Inside - Sakshi

Ritika Singh: రితికాపై మీడియా ఫైర్‌, క్షమాపణలు కోరిన హీరోయిన్‌!

Mar 2 2023 3:28 PM | Updated on Mar 2 2023 4:13 PM

Media Fires On Actress Ritika Singh At In Car Movie Promotions - Sakshi

రితికా సింగ్‌.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది. రియల్‌ బాక్సర్‌ అయిన రితికా.. గురు మూవీతో హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసి.. తొలి చిత్రానికే నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ సినిమా చేశారు. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఆమె తాజాగా ఇన్‌ కార్‌ అనే మూవీలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో రితికాకు చేదు అనుభవం ఎదురైంది.

చదవండి: తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్‌ బీస్ట్‌ లుక్‌ చూశారా?

ఆమెపై తమిళ మీడియా ప్రతినిధులు ఫైర్‌ అయిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చెప్పిన టైం కంటే ఆలస్యంగా వచ్చినందువల్లే రితికాపై మీడియా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రిసెంట్‌గా చెన్నైలో ఇన్‌ కార్‌ ప్రమోషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం జరగాల్సిన ఈ సమావేశానికి రితికా మూడు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఆమె కార్యక్రమానికి రాగానే మీడియా ప్రతినిథులు రితికాపై గుర్రుమన్నారు. చెప్పిన టైం కంటే మూడు గంటలు లేటు వచ్చారని, ఇలా వేయిట్‌ చేయించడం కరెక్ట్‌ కాదంటూ ఆమెపై మండిపడ్డారు. దీంతో రితికా మీడియాను క్షమాపణలు కోరారు.

చదవండి: 47 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ తల్లి

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నేను కావాలని చేయలేదు. మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల ఆలస్యమైంది. ప్రొగ్రామ్‌ టైం రాత్రి 9 గంటలకు అని నాకు మెసేజ్‌ పెట్టారు. కావాలంటే ఆ మెసేజ్‌ కూడా చూపిస్తా. నేను చెప్పిన టైంకే వచ్చాను. అయినప్పటికీ నన్ను క్షమించండి’ అని ఆమె వివరణ ఇచ్చారు. అయితే ఈ ప్రొగ్రామ్‌ సాయంత్రం 6, 7 గంటల మధ్యలో జరగాల్సి ఉండగా మిస్‌ కమ్యుకేషన్‌ వల్ల ఆలస్యమైందని తెలుస్తోంది. కాగా రితికా తమిళంలో చివరగా ఓ మై కడువలే సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పిచ్చకారై 2(బిచ్చగాడు 2), వనంగ ముడి, కొలై వంటి చిత్రాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement