రియల్ బాక్సర్ రితికా సింగ్ ఇరుది చుట్రు చిత్రం ద్వారా కథానాయకిగా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఆ చిత్రం జాతీయ ఉత్తమ నటి అవార్డులు తెచ్చిపెట్టింది. కాగా అదే చిత్రంతో తెలుగులోనూ పరిచయమైన రితికా సింగ్ తమిళ్‌లో శివలింగ, ఓ మై కడవులే తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాగా తాజాగా ఇన్ కార్ అనే పాన్ ఇండియా చిత్రంలో కథానాయకిగా ప్రధాన పాత్రను పోషించింది. ఇన్ బాక్స్ పిక్చర్స్ పతాకంపై అంజుమ్ ఖురేషి, సాజిత్ ఖీరేషీ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 3వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం మొదలగు ఐదు భాషల్లో సిద్దమైన ఈ చిత్రాన్ని తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థ ద్వారా కేఈ జ్ఞానవేల్ రాజా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ.. తన బంధువుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం ఇన్ కార్ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత తాను కొన్ని రోజులపాటు ఆ పాత్ర నుంచి బయటపడలేక పోయానని చెప్పారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని నటి రితికా సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment