నటుడు విజయ్‌ చెప్పినట్లు..! | Keerthy Suresh reacts on her marriage rumors | Sakshi
Sakshi News home page

నటుడు విజయ్‌ చెప్పినట్లు..!

Published Sun, Jul 28 2024 9:45 AM | Last Updated on Sun, Jul 28 2024 9:45 AM

Keerthy Suresh reacts on her marriage rumors

 ప్రస్తుతం పాన్‌ ఇండియా కథానాయకిగా మారిన నటి కీర్తీసురేశ్‌. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించి మెప్పింగల నటి ఈ బ్యూటీ. అపజయాలు విజయాలకు సోపానం అంటారు. అది కీర్తీసురేశ్‌కు చాలా బాగా వర్తిస్తుంది. ఈమె తల్లి మేనక అప్పట్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళియన్‌ అయిన ఈమె మలయాళ సినీ నిర్మాత సురేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా సినీ కుటుంబం నుంచి వచ్చిన కీర్తీసురేశ్‌ బాల నటిగానే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 

ఈమె కథానాయకిగా నటించిన తొలి తమిళ చిత్రం ఇదు ఎన్న మాయం. ఈ చిత్రం నిరాశ పరిచింది. ఆ తరువాత నటించిన రజనీ మురుగన్‌, రెమో వంటి చిత్రాలు హిట్‌ కావడంతో కీర్తీసురేశ్‌కు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా అక్కడ నటించిన మహానటి చిత్రం ఆమెను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేశారు. దీంతో కీర్తీసురేశ్‌ స్థాయి పెరగడంతో పాటు, వదంతులు అధికం అవుతున్నాయి. ఈ బ్యూటీ 20 ఏళ్ల వయసున్న ఓ నటుడి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తాజాగా వైరల్‌ అవుతున్న ప్రచారం. 

దీనిపై స్పందించిన కీర్తీసురేశ్‌ నటుడు విజయ్‌ చెప్పినట్లు వదంతులకు వివరణ ఇస్తే అది నిజం అవుతుందన్నారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం అన్నారు. ఇకపోతే నటన గురించి విమర్శలను తాను స్వాగతిస్తానని, ఒక నటిగా అవి తనను మెరుగుపరుస్తానికి ఉపయోగపడతాయని కీర్తీసురేశ్‌ సమాధానం ఇచ్చారు. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం రఘుతాత ఆగస్ట్‌ 15వ తేదీన తెరపైకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement