ఇన్‌ కార్‌: కాలేజీ యువతిని కిడ్నాప్‌ చేసి.. | In Car is being made at a Pan India level | Sakshi
Sakshi News home page

In Car Movie: కిడ్నాపర్స్‌ చేతిలో చిక్కుకున్న హీరోయిన్‌!

Published Sat, Feb 18 2023 1:47 AM | Last Updated on Sat, Feb 18 2023 8:31 AM

 In Car is being made at a Pan India level  - Sakshi

‘గురు’ సినిమా ఫేమ్‌ రితికా సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఇన్‌ కార్‌’. హర్షవర్థన్‌ దర్శకత్వం వహించారు. ఇన్‌ బాక్స్‌ పిక్చర్స్‌పై అంజుమ్‌ ఖురేషి, సాజిద్‌ ఖురేషి నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆయా భాషల ట్రైలర్స్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘‘సర్వైవల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామా ‘ఇన్‌ కార్‌’.

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. కాలేజీకి వెళ్లే ఓ అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేస్తారు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేయాలనుకుంటారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆమెను వారు తీవ్రంగా గాయపరుస్తారు. ఆ తర్వాత ఆమె పోరాటం చేసి, వారి నుంచి ఎలా తప్పించుకుంది? అనేది చిత్రకథ’’ అని యూనిట్‌ పేర్కొంది. సందీప్‌ గోయత్, మనీష్‌ ఝంజోలియా, జ్ఞాన్‌ ప్రకాష్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: మిథున్‌ గంగోపాధ్యాయ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement