రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతీ సనన్ నటించిన చిత్రం ఆదిపురుష్. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. సీతను రావణుడు అపహరించుకుపోవడం, శబరి ఎంగిలి పళ్లు రాముడు తినడం, సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం, లంకను తోకతో అంటించడం, సముద్రంలో బండరాళ్లు వేసి లంకకు దారి ఏర్పరచడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.
'నా ప్రాణమే జానకిలో ఉంది', 'మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం', 'నాకోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అంటూ ప్రభాస్ నోటి వెంట వచ్చిన డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయం.
'రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు, ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి' అని జానకి చెప్పే డైలాగులు బాగున్నాయి. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను భూషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, క్రిషణ్ కుమార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. జూన్ 16న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తుండగా కార్తీక్ పల్నానీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే గతంలో రిలీజ్ చేసిన టీజర్‌లో గ్రాఫిక్స్, విజువల్స్ అస్సలు బాగోలేదని పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఇంత నాసిరకమైన గ్రాఫిక్స్ ఏంటని దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో మేకర్స్ మళ్లీ రీషూట్స్ చేసి గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్‌తో సరికొత్తగా ముందుకు వచ్చారు. మరి ఈ ట్రైలర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment