Is Pan India Actor Prabhas Upcoming Adipurush Movie Postponed, Deets Inside - Sakshi
Sakshi News home page

Adipurush Movie: సంక్రాంతి బరిలో లేని ఆదిపురుష్.. రిలీజ్ అప్పుడేనా?

Published Mon, Oct 31 2022 3:08 PM | Last Updated on Mon, Oct 31 2022 3:45 PM

Pan India Star Prabhas Latest Movie Adipurush Postponed - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్‌ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ మూవీని సంక్రాంతి విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. కానీ తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ టాక్ తెగ వైరలవుతోంది. ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై సంబంధించిన ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్‌ తెగ వైరలవుతోంది.  

(చదవండి: Prabhas: ఆదిపురుష్‌ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌.. యుద్ధ వీరుడిలా ప్రభాస్‌ లుక్‌)

తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో.. 'పెద్ద మూవీ వాయిదా పడింది. మేకర్స్ క్లారిటీ కోసం వేచి ఉండండి' అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో ఆదిపురుష్ ట్యాగ్‌తో ట్రెండింగ్‌ అవుతోంది. కాగా.. ఈ మూవీలో సీతగా కృతీసనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అందులో ప్రభాస్‌ రాముడి గెటప్‌లో అదిరిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement