చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని అంటుంటారు కదా.. ఈ బ్యూటీ మాత్రం వేరే
స్వతహాగా బాక్సర్ అయిన ఈమె అనుకోకుండా హీరోయిన్ అయింది. ఈమె పేరు రితికా సింగ్
ఈమె పుట్టినరోజు నేడు (డిసెంబర్ 16). ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.
ముంబైలో పుట్టి పెరిగిన రితికా.. చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది.
పెద్దయ్యాక పలు బాక్సింగ్ లీగ్స్‌లో పాల్గొని విజేతగానూ నిలిచింది.
బాక్సర్ నేపథ్య కథతో తీసిన 'సాలా ఖదూస్' మూవీతో నటిగా మారింది. ఈ మూవీ పెద్ద హిట్ అయింది.
ఇదే సినిమాని వెంకటేశ్ హీరోగా 'గురు' పేరుతో తీస్తే, ఇందులోనూ రితికానే నటించింది.
అలా అనుకోకుండా నటి అయిన రితికా.. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో పలు సినిమాలు చేసింది.
తెలుగులో ఈమె.. గురు, నీవెవరో, వళరి సినిమాల్లో హీరోయిన్‍గా నటించింది.
'ఓ మై కడవులే' అనే తమిళ సినిమా ఈమెకు బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది.
రీసెంట్గా రజినీకాంత్ 'వేట్టయన్'లోనూ పోలీస్ పాత్ర చేసి ఆకట్టుకుంది.
గ్లామరస్‌గానూ ఉండే రితికా.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్స్‌తో రచ్చ లేపుతూ ఉంటుంది.


