కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై నాని, ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘నిన్నుకోరి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ల నటనకు ప్రశంసలు దక్కాయి. మళ్లీ కోన వెంకట్ ఆది పినిశెట్టితో కలిసి మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు చిత్రయూనిట్. మే 24న 11 గంటల 11 నిమిషాలకు ఈ మూవీ టైటిల్‌ను నాని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ఆదికి జోడిగా తాప్సీ, రితికా సింగ్ నటించనున్నారు. ‘లవర్స్’ ఫేమ్ హరి దర్శత్వంలో ఎమ్‌వీవీ సత్యనారాయణతో కలసి రచయిత కోన వెంకట్ తన కోన ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరో, విలన్, పాజిటివ్ క్యారెక్టర్.. ఏదైనా సరే తన నటనతో ఆకట్టుకునే ఆది ఈ సినిమాలో అంధుడిగా నటిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment