
గేర్ మార్చిన వెంకీ!
ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్ జోరు మీదున్నారు. గత రెండేళ్లూ ఏడాదికి ఓ సినిమా మాత్రమే చేశారు. ఇప్పుడు గేరు మార్చారు. ఈ ఏడాది ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న సమయంలోనే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి రెడీ చేస్తున్నారు. తమిళ, హిందీ భాషల్లో మాధవన్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారనే విషయం తెలిసిందే.
ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్‌గా నటించిన రితికా సింగ్ తెలుగులోనూ నటించనున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘చల్ చలో..’ పాట తరహాలో ఓ స్ఫూర్తిమంతమైన పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి స్వరకర్త.