
సీనియర్ నటుడు వెంకటేష్
తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు చేయటంలో విక్టరీ వెంకటేష్ కు అరుదైన రికార్డ్ ఉంది. వెంకీ కెరీర్‌లో ఘనవిజయాలు సాధించిన చాలా చిత్రాలు రీమేక్‌గా తెరకెక్కినవే. ఇటీవల వెంకటేష్ హీరోగా సక్సెస్ సాధించిన దృశ్యం, గురు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే. తాజాగా మరో సూపర్ హిట్‌ను రీమేక్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ది గ్రేట్ ఫాదర్ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఒరిజినల్ వర్షన్‌లో మమ్ముట్టి నటించిన పాత్రను తెలుగులో వెంకటేష్ చేయనున్నారు. ఈ సినిమాను తమిళ్‌లో విక్రమ్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ది గ్రేట్ ఫాధర్ సినిమా చూసిన వెంకీ తన నిర్ణయాని మాత్రం ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment