Mrunal Thakur Shares Emotional Note On 'Sita Ramam' Completes One Year - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: మిమ్మల్ని మరింత అలరిస్తా.. తెలుగు ఆడియన్స్‌పై ప్రేమతో మృణాల్!

Published Sat, Aug 5 2023 4:00 PM | Last Updated on Sat, Aug 5 2023 4:23 PM

Mrunal Thakur Shares Emotional Note Sitaramam Completes One Year - Sakshi

సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఇటీవల బాలీవుడ్‌లో బిజీ అయిన భామ.. తాజాగా లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్‌లోనూ కనిపించింది. సీతారామం చిత్రంలో చాలా పద్ధతిగా కనిపించిన భామ.. లస్ట్ స్టోరీస్‌లో మరింత బోల్డ్‌గా కనిపించి అందరికీ షాకిచ్చింది.

(ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..!)

అయితే తాజాగా మృణాల్ ఠాకూర్‌ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. సరిగ్గా ఏడాది క్రితం తెలుగులో ఎంట్రీ ఇచ్చానని తెలిపింది. ఈ ప్రయాణంలో మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ సీతారామం మూవీ వీడియోను పంచుకుంది. సీతారామం విడుదలై ఈ రోజుకు ఏడాది పూర్తి కావడంతో మృణాల్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. తనను తెలుగు అమ్మాయిలా భావించి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. 

మృణాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ప్రియమైన ప్రేక్షకులారా.. ఇది నా మొదటి తెలుగు సినిమా. మీరందరూ నాపై కురిపించిన ప్రేమ.. నా కలలకు మించిపోయింది.  మీరు నన్ను మీ తెలుగు అమ్మాయిలా అంగీకరించారు. ఈ అందమైన ప్రయాణాన్ని చిరస్మరణీయం  చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే కాలంలో మరిన్నీ విభిన్నమైన పాత్రలతో మిమ్మల్ని అలరిస్తానని మాట ఇస్తున్నా. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. సీత ఉత్తమ వెర్షన్‌ని తీసుకురావడంలో నాకు సహాయం చేసినందుకు హను రాఘవపూడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొత్తం అనుభవాన్ని  ఎంత చిరస్మరణీయం చేసినందుకు దుల్కర్ సల్మాన్‌కు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఎప్పటికీ మా సీత నువ్వే కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: రొమాంటిక్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న 'రసవతి'..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement