కెమిస్ట్రీ కుదిరింది! | Dulkar Salman, Sai Pallavi is a pair of hay .. baby | Sakshi
Sakshi News home page

కెమిస్ట్రీ కుదిరింది!

Published Thu, Oct 5 2017 12:50 AM | Last Updated on Thu, Oct 5 2017 12:50 AM

Dulkar Salman, Sai Pallavi is a pair of hay .. baby

దుల్కర్‌ సల్మాన్, సాయి పల్లవి జంటగా సమీర్‌ తాహిర్‌ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘కలి’. సూరెడ్డి గోపాలకృష్ణ (యూ.ఎస్‌.ఎ) సమర్పణలో లక్ష్మీచెన్నకేశవ ఫిలింస్‌ పతాకంపై డి.వి కృష్ణస్వామి  తెలుగులో ‘హేయ్‌.. పిల్లగాడ’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెన్సార్‌ బోర్డ్‌  క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇచ్చిన సందర్భంగా కృష్ణస్వామి మాట్లాడుతూ – ‘‘చక్కని ప్రేమకథ.

దుల్కర్, సాయిపల్లవిల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. గోపీ సుందర్‌ సంగీతం, గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రఫీ హెలైట్‌గా నిలుస్తాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే ఎలిమెంట్స్‌ సినిమాలో ఉన్నాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement