ప్రతీకారం పరిష్కారం కాదు
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ద ర్శకత్వం అనే కత్తికి రెండు పక్కల పదునుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మౌనరాగం, రోజా, ఘర్షణ, గీతాంజలి, నాయగన్, అంజలి, దళపతి ఇలా ఏ తరహా కథనైనా తన స్టైల్‌లో వెండితెర పై ఆవిష్కరించి పేక్షకులతో చప్పట్లు కొట్టించుకోగల దర్శక సవ్యసాచి మణిరత్నం. తాజాగా ఓ కాదల్ కణ్మణి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల్ని రంజింపజేసిన ఆయన ఇప్పుడు యాక్షన్ వైపు దృష్టి సారించారు. కార్తీ, దుల్కర్ సల్మాన్, కీర్తీ సురేష్ హీరోహీరోయిన్లుగా కమర్షియల్ కోణంలో చిత్రానికి రూపం ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.
ఇది గ్యాంగ్‌స్టర్ కథా చిత్రం అనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. అయితే కమర్షియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా దీన్ని మణిరత్నం తీర్చిదిద్దనున్నారని, ఇందులో ప్రతీకారేచ్చ పరిష్కారం కాదనే చక్కని సందేశం కూడా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గం మాట. మణిరత్నం ఈ తాజా చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా సిద్ధం చేశారని జనవరిలో చిత్రాన్ని సెట్‌పైకి తీసుకెళ్లడమే తరవాయి అని అంటున్నారు. దీనికి ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు.