మణిరత్నం చిత్రంలో పైలట్‌గా కార్తీ | Karthi to play a pilot in Mani Ratnam's next | Sakshi
Sakshi News home page

మణిరత్నం చిత్రంలో పైలట్‌గా కార్తీ

Published Wed, Jul 6 2016 1:32 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

మణిరత్నం చిత్రంలో పైలట్‌గా కార్తీ - Sakshi

మణిరత్నం చిత్రంలో పైలట్‌గా కార్తీ

ఎస్ డెరైక్టర్ మణిరత్నం తాజా చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం కొన్ని ప్రాజెక్ట్‌లు అనుకున్నా అనివార్యకారణాల వల్ల అవి ఆచరణలోకి రాలేదు. దీంతో ఈ ప్రఖ్యాత దర్శకుడి చిత్రం ఇదిగో,అదిుగో ప్రారంభం అవుతోంది అంటూ ప్రచారాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆయన  తాజా చిత్రం సెట్ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రాన్ని మొదలెడుతున్నారు. ఇందులో కార్తీకి జంటగా ముంబై బ్యూటీ అదితిరావును ఎంపిక చేశారు.

అంతే కాదు ఈ చిత్రానికి కాట్రు వెలియిడై అనే టైటిల్‌ను కూడా మణిరత్నం ఫిక్స్ చేశారన్నది తాజా సమాచారం. ఇందులో కార్తీ విమాన పైలట్‌గా నటించనున్నట్లు తెలిసిందే. ఇందుకోసం ఆయన చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారయ్యారట. ఈ చిత్ర షూటింగ్ 8వ తేదీ నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. తొలుత పాటతో మొదలయ్యే ఈ కాట్రు వెలియిడై చిత్రం అక్కడ 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలిసింది.

దీనికి మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, రవివర్మ చాయాగ్రహణను, వైరముత్తు పాటలను అందిస్తున్నారు. మణిరత్నం తన మెడ్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు, దీన్ని ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement