
బృందా మాస్టర్
నృత్య దర్శకురాలిగా ఎన్నో వందల సినిమాలకు పని చేశారు బృందా. రజనీకాంత్, కమల్‌హాసన్, మోహన్ లాల్, విజయ్, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్స్‌తో ఫ్యాన్స్ విజిల్స్ కొట్టే డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేశారు బృందా. ఇప్పుడు బృందా మాస్టర్ డైరెక్షన్ వైపు స్టెప్స్ (అడుగులు) వేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఓ తమిళ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించనున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment