Rashmika Mandanna First Look Release Dulquer Salmaan Movie - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: దుల్కర్‌ సల్మాన్‌తో జతకట్టిన రష్మిక, ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Published Tue, Apr 5 2022 2:25 PM | Last Updated on Tue, Apr 5 2022 5:58 PM

Rashmika Mandanna First Look Release From Dulquer Salmaan Movie - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నేటితో(ఏప్రిల్‌ 5) 26వ వసంతంలోకి అడుగు పెడుతుంది. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇప్పటికే ఆమె ‘పుష్ప 2’తో పాటు హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే రణ్‌బీర్‌ కపూర్‌-సందీప్‌ వంగ దర్శకత్వంలో వస్తున్న ఏనిమల్‌ వరల్డ్‌ చిత్రంలో హీరోయిన్‌ చాన్స్‌ కొట్టెసింది. ఇప్పుడు తాజాగా ఆమె మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌తో జతకట్టబోతోంది.

ఈ రోజు ఆమె బర్త్‌డే సందర్భంగా ఈ మూవీలోని తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఆమె పాత్ర పేరు కూడా ప్రకటించారు. కాగా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రొమాంటిగ్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కినున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఆమె అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

(చదవండి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ పై అక్షయ్‌ భార్య సంచలన వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement