Kiran Abbavaram 'meter Movie' First Look Released | Kiran Abbavaram Birthday - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Birthday: మైత్రీ మూవీ బ్యానర్లో యంగ్‌ హీరో చిత్రం, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అవుట్‌

Published Fri, Jul 15 2022 12:29 PM | Last Updated on Fri, Jul 15 2022 1:01 PM

Kiran abbavaram Birthday: First Look Release From Meter Movie - Sakshi

టాలెంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. శుక్రవారం (జూలై 15న) పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. పలువురు టాలీవుడ్‌ ప్రముఖు, హీరోహీరోయిన్లు కిరణ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఇదిలా ఈ హీరో బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌ వదులుతున్నారు మేకర్స్‌. కాగా ప్రస్తుతం కిరణ్‌ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. అందులో ‘మీటర్‌’ ఒకటి. ర‌మేష్ కాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర​స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి

నేడుకిర‌ణ్ అబ్బ‌వ‌రం బ‌ర్త్‌డే సందర్భంగా ‘మీట‌ర్’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో కిర‌ణ్ మాస్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాలో కిర‌ణ్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. అతుల్య ర‌వి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చిరంజీవి, హేమ‌ల‌త నిర్మిస్తున్నారు. సూర్య ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నాడు. సాయి కార్తిక్ స్వ‌రాల‌ని స‌మ‌కూరుస్తున్నాడు. ప్ర‌స్తుతం కిర‌ణ్ ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’, ‘రూల్స్ రంజ‌న్‌’, ‘విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ’ చిత్రాల షూటింగ్‌ బిజీగా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement