Rashmika Mandanna Said She Blocked The Number Thinking Her First Film Offer Was Prank Call - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: తొలి అవకాశం..డైరెక్టర్ నంబర్‌ బ్లాక్ చేశా: రష్మిక

Published Wed, Apr 5 2023 10:50 AM | Last Updated on Wed, Apr 5 2023 11:33 AM

Rashmika Mandanna thought her first film offer was prank call - Sakshi

రష్మిక మందన్నా ఈ పేరు వింటే చాలు సౌత్, బాలీవుడ్‌తో ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆమె నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ఏకంగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్‌ సొంతం చేసుకుంది. ఇవాళ రష్మిక 28వ ఏట అడుగుపెడుతోంది. ఏప్రిల్ 5న ఈ అమ్మడు బర్త్‌ డే కావడంతో పుష్ప-2 టీమ్ కూడా క్రేజీ అప్‌ డేట్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.  చివరిసారిగా వారసుడు మూవీతో అభిమానులను పలకరించింది అమ్మడు. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించనుంది. అయితే తన సినీరంగంలో ఎంట్రీపై ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. 

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందాల పోటీలో గెలుపొందిన తర్వాత తనకు సినిమాలో ఆఫర్ చేశారని తెలిపింది. అయితే అది ప్రాంక్ కాల్‌గా భావించి 'నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి' అని ఆ నంబర్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీంతో దర్శక, నిర్మాతలు స్నేహితుల ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ చివరికి వారు నా క్లాస్ టీచర్‌ ద్వారా నన్ను కలిశారు. చిత్రనిర్మాతని కలిశాక.. తనకు ఎలా నటించాలో తెలియదని చెప్పినట్లు రష్మిక తెలిపింది. అయితే తనతో కొన్ని డైలాగ్‌లను రికార్డ్ చేసిన తర్వాత ఎంపిక చేశారని చెప్పుకొచ్చింది.   కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ మూవీ పుష్ప సీక్వెల్ పుష్ప-2 అలరించేందుకు సిద్ధమైంది. 

రష్మిక సినీ కెరీర్
రష్మికా మందన్నా 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. 2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించిన రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె పాత్రకు ఉత్తమ తొలి ప్రదర్శనగా సైమా అవార్డును కూడా గెలుచుకుంది. 2017లో రష్మిక రెండు కన్నడ చిత్రాలలో అంజనీ పుత్ర, చమక్‌లో కనిపించింది.

టాలీవుడ్‌లో ఛలో చిత్రం ద్వారా అడుగు పెట్టింది.  2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం కాగా.. అదే సంవత్సరంలో గుడ్‌ బై సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2017లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కాగా.. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మేకర్స్ విషెస్ చెబుతూ ట్వీట్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement