
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న రష్మికకు సంబంధించి తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. కెరీర్ ప్రారంభించిన 5ఏళ్లలోనే రష్మిక ఐదు ప్రదేశాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందట.
తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్‌మెంట్స్ ఉన్నాయంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా రష్మిక స్పందించింది. 'ఇదంతా నిజమైతే బాగుండు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇవన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.
కాగా ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. 'పుష్ప' హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది.
#Rashmika owns 5 luxurious apartments in 5 places🤨#RashmikaMandanna 🔥 pic.twitter.com/9zHBwvPU37
— Nerdy News (@NerdyNews07) February 10, 2023