ఆ సాంగ్‌కు గుజరాత్‌లోనూ క్రేజ్.. ఫిదా అయిన రష్మిక | Rashmika Mandanna Reacts to Saami Saami Steps In Garba Choreography | Sakshi
Sakshi News home page

Pushpa Song: పుష్ప సాంగ్‌కు గుజరాత్ యువత స్టెప్పులు.. రష్మిక ఫిదా

Published Mon, Sep 26 2022 9:22 PM | Last Updated on Mon, Sep 26 2022 9:26 PM

Rashmika Mandanna Reacts to Saami Saami Steps In Garba Choreography - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన్నా నటించిన మూవీ పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రంలోని పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఈ సినిమాలోని సామీ సామీ అంటూ సాగే పాట యువతను ఓ రేంజ్‌లో ఊర్రూతలూగించింది. తాజాగా ఆ పాటకు గుజరాతీలోని గర్బా నృత్యానికి మిక్స్ చేసి స్టెప్పులను కొరియోగ్రఫీ చేశారు. దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో స్టెప్పులేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరలవడంతో పుష్ప బ్యూటీ రష్మిక ఫిదా అయిపోయింది.  

(చదవండి: బాలీవుడ్‌ నటుడితో పుష్ప భామ స్టెప్పులు.. వీడియో వైరల్)

ఆ సాంగ్‌లో హుక్‌ స్టెప్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఆ వీడియోపై రష్మిక స్పందించింది. గుజరాత్ యువత స్టెప్పులకు క్రేజీ అంటూ ఎమోజీలను జత చేసింది. ఇటీవల సూపర్ మామ్స్-3 ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రష్మిక మందన్నా బాలీవుడ్‌ నటుడు గోవిందతో కలిసి 'రారా సామి బంగారు సామి' అంటూ స్టెప్పులతో అదరగొట్టింది. పుష్ప చిత్రంలోని పాటలకు రిహార్సల్‌ వీడీయోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.  

 కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. టాలీవుడ్‌తో స్టార్‌డమ్‌ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. 'పుష్ప' మూవీతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్‌ల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో విజయ్ నటిస్తున్న 'వారీసు' (వారసుడు) చిత్రంలో నటిస్తోంది. అలాగే 'పుష్ప 2'తోపాటు మరికొన్ని హిందీ, కోలీవుడ్ ప్రాజెక్టులు చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement