'ఈ పరిస్థితిని నమ్మలేకపోతున్నా'.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన శ్రీవల్లి! | Rashmika Mandanna Reacts On Allu Arjun Arrest In Sandhya Theatre Issue | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'ఈ పరిస్థితిని నమ్మలేకపోతున్నా'.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై స్పందించిన శ్రీవల్లి!

Published Fri, Dec 13 2024 6:48 PM | Last Updated on Fri, Dec 13 2024 7:20 PM

Rashmika Mandanna Reacts On Allu Arjun Arrest In Sandhya Theatre Issue

అల్లు అ‍ర్జున్‌ అరెస్ట్‌పై పుష్ప హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలను తాను నమ్మలేకపోతున్నానంటూ ట్వీట్ చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపింది. ప్రతి విషయాన్నికి ఓకే వ్యక్తిని నిందించడం బాధాకరమైన విషయమన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ట్వీట్ చేసింది.

కాగా.. పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసులో బన్నీకి హైకోర్డు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement