
కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్‌గా స్టార్ హోదా దక్కించుకుంది. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది వచ్చిన 'యానిమల్'తో నటిగా తానేంటో నిరూపించింది. ఇప్పుడు 'కుబేర'తో మరోసారి సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది.
(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..)
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లుగా కాగా నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే ధనుష్, నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేశారు. ఇప్పటివరకు చేయని పాత్ర ఏదో రష్మిక చేసినట్లు అనిపిస్తుంది.
ఈ వీడియోలో రష్మిక.. ఓ గునపం తీసుకుని పాతిపెట్టిన సూట్ కేసుని బయటకు తీస్తుంది. అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment