ఆ పార్టీలో నాపై చెయి వేశాడు.. నిలదీస్తే బోరున ఏడ్చాడు: కస్తూరి | Senior Actress Kasthuri Comments On Fans Behavior - Sakshi
Sakshi News home page

దుల‍్కర్‌ సల్మాన్‌నే కాదు నన్ను కూడా అసభ్యంగా టచ్‌ చేశారు: కస్తూరి

Published Sat, Aug 26 2023 1:08 PM | Last Updated on Sat, Aug 26 2023 1:50 PM

Senior Actress Kasthuri Comments On Fans Behavior - Sakshi

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించి ఎంతోమంది మనసు దోచేసిన కస్తూరి.. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తోంది. తాజాగా నటుడు దుల్కర్ సల్మాన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే తన లైఫ్‌లో కూడా చోటుచేసుకుందని ఓ ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కస్తూరి ఎమోషనల్ అయింది.

దుల్కర్ సల్మాన్‌ను అసభ్యంగా టచ్‌ చేసిన మహిళ 
గతంలో ఓ అభిమాని ప్రవర్తన వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని నటుడు దుల్కర్‌ సల్మాన్‌  ఓపెన్‌గానే తెలిపారు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ తనని ఇబ్బందికరంగా పట్టుకుందని  ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ మూవీ ప్రమోషన్స్‌ సమయంలో చెప్పారు.  కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ తన బుగ్గపై ముద్దు పెట్టాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తనతో ఆశ్చర్యపోయానని దుల్కర్‌ చెప్పాడు. గతంలో ఒక పెద్దావిడ వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఆమె తనను అభ్యంతరకరంగా తాకడంతో ఎంతో బాధనిపించిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.

టచ్‌ చేసి అక్కా సారీ.. సారీ అంటే ఎలా
ఇలాంటి ఘటనే సీనియర్‌ నటి కస్తూరి జీవితంలో జరిగిందని తెలిపింది. కోలీవుడ్‌లో స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందని ఇలా చెప్పుకొచ్చింది. ‘‘ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఒక ఈవెంట్‌ను ప్రముఖ సంస్థ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా భారీగా జనం తరలివచ్చారు. ఎవరో నన్ను వెనుక నుంచి నొక్కుతున్నట్లు అనిపించింది. ఇది జరిగినప్పుడు మా నాన్న నాతోనే ఉన్నారు. నేను వెంటనే అతని చెయి పట్టుకుని నా ముందుకు లాగాను. దీంతో వాడు ఆ సమయంలో  విపరీతంగా ఏడ్చాడు.. అక్కా సారీ.. సారీ అంటూ గట్టిగా ఏడవడం మెదలుపెట్టాడు. ఇలాంటి చెత్త పనులు చేసి అక్కా అని వేడుకోవడం ఎందుకు' అని నటి కస్తూరి చెప్పింది. 

కామెంట్ బాక్స్‌లోకి వచ్చి ఇలాంటి కామెంట్లు
ఇలాంటి వారి వల్ల ఇండస్ట్రీలో చాలమంది నటీమణులు ఇబ్బందులకు గురైన వారున్నారు. ఇలాంటి ఘటనలపై కొందరు నటీనటులు బహిరంగంగానే ఇప్పుడు చెబుతున్నారని కస్తూరి తెలిపింది. అంతేకాకుండా ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొందరు తమపై సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తూ సైబర్ దాడులకు దిగుతుంటారని పేర్కొంది. సోషల్ మీడియాలో చాలామంది తమ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురవుతున్నారు. తమ కోపాన్ని ఎక్కడ బయట పెట్టాలో తెలియడం లేదు. అందుకే కామెంట్ బాక్స్‌లోకి వచ్చి ఇలా రచ్చ సృష్టిస్తున్నారని కస్తూరి చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement