
మలయాల నటుడు సిద్ధు ఆర్ పిళ్లై మృతదేహం సోమవారం గోవా బీచ్‌లో కనిపించింది. సిద్దు ప్రముఖ నిర్మాత పీకేపీ పిళ్లై కుమారుడు. జనవరి 12న సిద్దు గోవాకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఏమీ జరిగిందో తెలియదు. సడన్‌గా గోవా బీచ్‌లో సోమవారం శవమై కనిపించారు. సిద్ధు తల్లి మృతదేహాన్ని గుర్తుపట్టారు. ఇది హత్యా, ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు ఆయన బీచ్‌లో మునిగిపోయారా అనే విషయంపై స్పష్టత లేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సిద్ధు శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వం వహించిన ‘సెకండ్ షో’ సినిమాతో నటుడిగా తన కెరీర్‌ని ప్రారంభించారు. ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా సిద్ధు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సెకండ్ షో సినిమా షూటింగ్‌లో సిద్ధు ఉత్సాహంగా ఉండేవాడని, ఆయన మృతి చాలా బాధాకరమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Disturbed and sad about the passing of #SidhuRPillai ! Was an excited and vivacious youngster during #SecondShow. Prayers to his family 😞
— dulquer salmaan (@dulQuer) January 16, 2018
Comments
Please login to add a commentAdd a comment