Man Murders Woman On Goa Beach After She Refused To Continue Relationship - Sakshi
Sakshi News home page

Goa Crime: ప్రియురాలు బ్రేకప్‌ చెప్పిందని.. గోవా బీచ్‌కు తీసుకెళ్లి..

Published Fri, May 20 2022 12:18 PM | Last Updated on Fri, May 20 2022 1:39 PM

Man Murders Woman On Goa Beach For Ending Relationship - Sakshi

ప్రేమలో పడటం, ఏదో ఒక కారణంతో విడిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇక బ్రేకప్‌ చెప్పిందని ప్రియురాలిపై కక్షసాధింపు చర్చలకు పాల్పడటం కూడా అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. తనకు కాదని వెళ్లిపోయిందనే భాధ, కోపం తట్టుకోలేక కొందరు ప్రాణాలను తీసేస్తున్నారు. ప్రేమలో పడితే లోకాన్నే మరిచిపోయే జంటలు.. అదే ప్రేమ వద్దని చెబితే ఏకంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తున్నారు.

తాజాగా తనకు బ్రేకప్‌ చెప్పిందని ప్రియురాలిని కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది. కిషన్‌ కలంట్కర్‌(26) అనే యువకుడు కలేజీలో చదువుతున్న19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. కొనాళ్లపాటు వీరి లవ్‌ ట్రాక్‌ బాగానే సాగింది. అయితే మనస్పర్థల కారణంగా రిలేషన్‌షిప్‌ కొనసాగించడం ఇష్టం లేదని, విడిపోదామని యువతి చెప్పింది. దీంతో యువకుడు మనస్తానికి గుయ్యాడు.

బ్రేకప్‌ను తట్టుకోలేక యువతితో కలిసి బుధవారం సౌత్‌గోవాలోని వెల్సాన్‌ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ కూడా తనను విడిచి వెళ్లొద్దంటూ ప్రాదేయపడ్డాడు. ఎంతకూ యువతీ ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడై అప్పటికే తనవెంట తెచ్చుకున్న కత్తితో యువతిని పొడిచి చంపాడు. యువతి చనిపోవడంతో మృతదేహాన్ని బీచ్‌ పక్కనే ఉన్న పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే  బీచ్‌ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితుడిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఊహించని షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement