
హీరో దుల్కర్ సల్మాన్ తన భార్య అమలాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.

ఈ మేరకు ఇన్ స్టాలో క్యూట్ అండ్ స్వీట్ పోస్ట్ పెట్టాడు.

పుట్టినరోజు ఫొటోల్లో కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నానని దుల్కర్ రాసుకొచ్చాడు.

ఇకపోతే దుల్కర్ భార్య.. ఇండస్ట్రీలోని చాలామంది హీరోయిన్ల కంటే అందంగా ఉంటుంది.

చెన్నైకి చెందిన ఈమె.. స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్.

2011లో దుల్కర్ సల్మాన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ పాప ఉంది.

ఇకపోతే దుల్కర్ సల్మాన్ పేరు మలయాళ హీరో గానీ అన్ని భాషల్లోనూ మూవీస్ చేస్తున్నాడు.

తెలుగులో ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' సినిమా చేశాడు. ఇది అక్టోబరు 27న రిలీజ్ కానుంది.

అంతకు ముందు 'మహానటి', 'సీతారామం' సినిమాలతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు.