
హేయ్... పిల్లగాడ
...‘ఫిదా’లోని ఈ పాట, అందులో సాయిపల్లవి డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ‘మేము ఫిదా’ అన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడీ పాటలోని తొలి రెండు పదాలనే సాయిపల్లవి కొత్త సినిమాకు టైటిల్‌గా పెట్టారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి జంటగా సామీర్ తాహిర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కలి’. ఈ సినిమాను తెలుగులో ‘హేయ్... పిల్లగాడ’ పేరుతో విడుదల చేస్తున్నారు లక్ష్మీ చెన్నకేశవ ఫిలింస్ అధినేత డీవీ కృష్ణస్వామి.
ఈ సినిమా లోగోను దర్శకులు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మలయాళ, తమిళ భాషల్లో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలు గులో కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక టిపికల్ లవ్‌స్టోరీ. దుల్కర్, సాయిపల్లవిల నటన, గోపీసుందర్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. సెప్టెంబర్ 8న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు డీవీ కృష్ణస్వామి. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దక్షిణ్ శ్రీనివాస్, సహ నిర్మాత: వి. చంద్రశేఖర్.