
మణి మనసు మార్చుకున్నారా?
మణిరత్నం తీసే సినిమాల్లోని హీరో హీరోయిన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటారు. ఆ విధంగా సెలక్ట్ చేయడంలో మణిరత్నం చాలా శ్రద్ధ చూపిస్తారు. మోహన్-రేవతి, కమల్‌హాసన్-శరణ్య, అరవింద్ స్వామి-మధుబాల, జగపతిబాబు-రేవతి, అరవింద్ స్వామి-మనీషా కొయిరాలా, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్... ఇలా మణిరత్నం సినిమాలో నటించిన అన్ని జంటలూ దాదాపు బాగుంటాయి.
వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జోడీ కూడా కనువిందు చేసింది. అందుకేనేమో ఈ చిత్రం హిందీ రీమేక్‌లో మణిరత్నం వేరే జంటను ఊహించలేకపోతున్నారని సమాచారం.
‘ఆషికీ-2’ ద్వారా హిట్ పెయిర్ అనిపించుకున్న ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లను ఈ రీమేక్‌లో నాయకా నాయికలుగా అనుకున్నారనే వార్త వినిపించింది. కానీ, ఆ తర్వాత మణిరత్నం మనసు మారిందని భోగట్టా. హిందీ రీమేక్‌లో కూడా దుల్కర్, నిత్యాలనే నటింపజేయాలనుకుంటున్నారట.