nithya
-
షట్లర్ తులసిమతికి రూ. 2 కోట్ల నజరానా
పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానాలు అందించారు. ఇటీవల జరిగిన పారాలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలిచిన తులసిమతి మురుగేశన్కు (ఎస్‌యూ5) బుధవారం ముఖ్యమంత్రి రూ.2 కోట్ల చెక్ అందజేశారు. కాంస్య పతకాలు సాధించిన మనీషా రామదాస్, నిత్యశ్రీకి చెరో కోటి రూపాయాల చెక్‌లు అందించారు. పురుషుల హైజంప్‌లో కాంస్యం గెలిచిన తమిళనాడు అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు రూ. 1 కోటి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యులైన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్లకు మంగళవారం నగదు ప్రోత్సాహకం అందించిన స్టాలిన్... తాజాగా పారా అథ్లెట్లకు కూడా నజారానాలు అందించి తమ ప్రభుత్వం క్రీడారంగానికి అండగా ఉంటుందని మరోసారి చాటి చెప్పారు. -
నేను మలయాళీ కాదు.. నా పేరు కూడా తప్పే
-
Anchor Ravi Latest Photos: గోవాలో భార్యతో యాంకర్ రవి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి
‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ హాస్టల్లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్ గేమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది. అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన. ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా స్పోర్ట్స్ స్కూల్ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్ స్కూల్లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు. ఆసియా గేమ్స్ ఆశాకిరణాలు మన దేశం నుంచి ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్ గేమ్స్‌లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్ రన్లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆసియా గేమ్స్ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య. పి.టి. ఉషతో సమానంగా విత్య రామరాజ్ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్‌లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్‌గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్‌లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్‌లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య. ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి. -
Nithya Shetty: దేవుళ్లు సినిమాలోని చిన్నారి ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
పాముకాటుకు చిన్నారి మృతి!
ఆదిలాబాద్: పాము కాటుకు చిన్నారి మృతి చెందింది. మండలంలోని హంపోలి గ్రామంలో సోమవారం వేకువజాము ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలు.. బాసిండ్ల రజిత–సాయినాథ్ దంపతులకు కూతురు నిత్య(7), రెండేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నారు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి కుటుంబీకులు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో నిత్య కాలికి ఏదో కరిచిందని ఏడ్చింది. వెంటనే తండ్రి ఆమె కాలిని పరిశీలించగా రక్తం రావడాన్ని గమనించాడు. వెంటనే దుప్పటి తీయగా బయటకువచ్చిన పామును చంపేశాడు. నిత్యను భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. -
ఎవరు?
నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్. -
నటుడు కృష్ణుడు కూతురి హాఫ్సారీ ఫంక్షన్.. ఫోటోలు వైరల్
-
స్ప్రింట్ ఫైనల్లో నిత్య, నరేశ్
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె. నరేశ్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్ పాల్, మహిళల ఈవెంట్లో పారుల్ చౌదరీ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో అభిõÙక్ (రైల్వేస్) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్ (14ని.17.20 సె.), అజయ్ కుమార్ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్ (రైల్వేస్ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు. మంత్రి చేతుల మీదుగా... మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ అకౌంట్లో తన ఎత్తు, బరువు, రేటు.. చదివి షాకైన నిత్య
‘‘నిత్యా, ఈ సెమిస్టర్లో కూడా నువ్వే ఫస్ట్, కంగ్రాట్స్!’ అంటూ వస్తూనే స్నేహితురాలిని అభినందించింది ఐషు. ‘థాంక్స్’ అంటూ నవ్వింది నిత్య. ఇద్దరూ క్లాసులోకి వెళ్లారు. క్లాస్మేట్స్ అందరూ నిత్యను అభినందనలతో ముంచెత్తారు. నిత్య, ఐషు (ఇద్దరి పేర్లు మార్చడమైంది) బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే నిత్య అంటే క్లాసులో అందరికీ అభిమానం. క్లాస్ అయిపోగానే నిత్య, ఐషులు తమ క్లాస్మేట్ రఘుతో కలిసి పార్టీకి బయటకెళ్లారు. మరుసటి రోజు కాలేజీకి వచ్చింది నిత్య. అందరూ తనను అదోలా చూస్తుండటం గమనించింది. ఎవరూ మునుపటిలా పలకరించట్లేదు. తను పలకరించినా ముభావంగానే ఉన్నారు. పక్కసీటులో ఉండే క్లాస్మేట్ ప్రవర్తన కొత్తగా అనిపించడంతో ‘ఏమైందంటూ’ దబాయించింది నిత్య. తన ఫోన్ చూపుతూ, అందులో వచ్చిన మెసేజ్‌లు చూపించింది క్లాస్మేట్. అవన్నీ నిత్యకు సంబంధించినవే. తన పేరుతో ఉన్న అకౌంట్లో తన ఎత్తు, బరువు, రేటు .. అంటూ ఏవేవో వివరాలు.. చదివిన నిత్య షాకైంది. అంతే కాదు ఫొటోలు కూడా అసభ్యంగా ఉన్నాయి. తన గురించి ఇంత చెత్తగా అదీ తన అకౌంట్ నుంచి ఎవరు పోస్ట్ చేశారో అర్ధం కాలేదు నిత్యకు. క్లాసులో చుట్టూ చూసిన నిత్యకు అవమానంతో అక్కడే భూమిలోకి వెళ్లిపోతే బాగుండనిపించింది. వెంటనే క్లాస్ నుంచి ఇంటికి వచ్చేసింది. విషయం తెలిసి వెంటనే నిత్యకు ఫోన్ చేసింది ఐషు. తనకేమీ తెలియదని చెబుతూనే, ఆ రోజుంతా ఏడుస్తూనే ఉంది నిత్య. కూతురి పరిస్థితి చూసిన తల్లితండ్రులు తల్లడిల్లిపోయారు. కూతురు భవిష్యత్తును దెబ్బతీయాలనుకున్న వారిపై చర్య తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కేసు ఫైల్ చేశారు. నిపుణుల సాయంతో ఆ ఫ్రాడ్ ఎవరో కనిపెట్టారు పోలీసులు. నిత్య పేరుతో చెత్త కామెంట్లు, ఫొటోలు అప్లోడ్ చేసింది ఎవరో కాదు నిత్య క్లాస్మేట్ రఘు అని తెలిసి ఆశ్చర్యపోయారు. రఘుని అరెస్ట్ చేశారు పోలీసులు. తనంటే ప్రత్యేక అభిమానం చూపే రఘు ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే నిత్యకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇదే విషయం పోలీసులకు చెప్పింది నిత్య. ఎప్పుడూ కలిసి ఉండే రఘు, నిత్య, ఐషులను విడివిడిగా ప్రశ్నించిన పోలీసులకు ఓ కొత్త విషయం అర్థమైంది. నిత్య మీద అసూయతో రగిలిపోయే ఐషు ఈ పని చేసిందని తెలుసుకున్నారు. రఘు ఫోన్‌ని వాడేది ఐషు. ఫ్రెండ్ కదా అని రఘు అడ్డు చెప్పేవాడు కాదు. రఘు తనను కాకుండా నిత్యను అభిమానిస్తున్నాడని, అన్నింటా తనే ముందుంటుందన్న అసూయ ఐషులో పెరిగిపోయింది. రఘు ఫోన్ నుంచి నిత్య పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, నిత్య గురించి చెడుగా కామెంట్ చేయడం మొదలుపెట్టింది. విషయం తెలిసి నిత్య–ఐషుల స్నేహం చెడిపోయింది. రఘు జీవితం ఇబ్బందుల్లో పడింది. టెక్నికల్‌గా ఐషు మీద యాక్షన్ తీసుకోలేమని, ఇలాంటి స్నేహితులకు దూరంగా ఉండమని పోలీసులు నిత్యకు హితవు చెప్పారు. అసూయను దరిచేర్చుకుంటే అది ద్వేషంగా మారి పతనం వైపుగా అడుగులు వేయిస్తుందనడానికి ఈ స్నేహితుల కథే ఉదాహరణ. ఫేక్ ప్రొఫైల్స్.. తస్మాత్ జాగ్రత్త స్నేహితులే కదా అని తమ ఫోన్ పాస్వర్డ్ వివరాలతో సహా చెప్పేసుకుని, అనుకోని పరిణామాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఇటీవల చూస్తున్నాం. ఆల్రెడీ మన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవారి నుంచి మళ్లీ రిక్వెస్ట్ ఎందుకు వస్తుంది..? అనేది గుర్తించాలి. తమ ఫ్రెండ్స్‌ని అలెర్ట్ చేయాలి. తెలియని వారు పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు. చాలా మంది ఎంత మంది ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఉంటే అంత గొప్ప అనుకుంటారు. వీటిల్లో హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. ఫేక్ అని తెలియగానే ఆ సదరు అకౌంట్‌ని బ్లాక్ చేస్తే మంచిది. ఇటీవల ఫేక్ అకౌంట్స్ బారిన పడి మోసపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. యువతలో డేటింగ్ సైట్స్ వాడే వారి సంఖ్య ఎక్కువ. ఈ సైట్లలో 50 శాతం ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ల స్నేహం మాయ గురించి మోసపోయాక కానీ తెలియదు. నిజానికి సోషల్‌మీడియాలో ఫేక్ ప్రొఫైల్ చూస్తేనే అర్థమైపోతుంది. అకౌంట్ ఇటీవల క్రియేట్ అయ్యి ఉండి, అందులో పూర్తి వివరాలు లేకుండా ఉంటే అనుమానించాలి. యూజర్‌నేమ్‌లో ఫస్ట్, లాస్ట్ నేమ్ అంటూ ఉండదు. ఆ అకౌంట్‌కి ఫాలోవర్లు ఉండరు. ఉన్నా.. వారే సృష్టించిన ఫేక్ ఐడీల జాబితాయే ఉంటుంది. వారి ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే వింత పేర్లు, స్టాక్ ఫొటోస్ పెట్టినవి ఉంటాయి. వాళ్ల కామెంట్స్ లిస్ట్‌లో సేమ్ కామెంట్స్ ఉంటాయి. ఫేక్ అకౌంట్స్‌కి ఒకే ఒక్క ఫొటో ఉంటుంది. ఆ ఫొటో కూడా ఎక్కడ నుంచి తీశారో గూగుల్ ఇమేజ్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. వీటిని బట్టి అకౌంట్ ఫేక్ అని గుర్తించాలి. ఇలా గుర్తించినప్పుడు కంప్లైంట్ చేయాలి. మన ప్రొఫైల్ కూడా లాక్ చేసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలే సైబర్ నేరాలకు అడ్డుకట్ట. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
దాడి బాలాజీపై భార్య ఫిర్యాదు
చెన్నై, పెరంబూరు: నటుడు దాడి బాలాజీపై అతని భార్య నిత్య మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుల్లితెర యాంకర్, హస్యనటుడు దాడి బాలాజి అతని భార్య నిత్య మధ్య కొంత కాలం క్రితమే మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరి వ్యవహారం కేసులు, కోర్టుల వరకూ వెళ్లింది. ఇద్దరు విడివిడిగా నివశిస్తున్నారు. నిత్య తన కూతురితో మాధవరం, శాస్త్రి నగర్లో నివశిస్తోంది. కాగా దాడిబాలాజి, నిత్య ఇద్దరూ ఆ మధ్య జరిగిన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్నారు. ఆ గేమ్ షోలో కూడా వీరిద్దరూ ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం మాధవరం పోలీస్‌స్టేషన్‌లో దాడి బాలాజీపై ఫిర్యాదు చేసింది. అందులో బాలాజీ మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని, గత జనవరి నెల 21న తాగి వచ్చి ఇంటి కిటికీలు పగులగొట్టి రగడ చేయడంతో పాటు ఫోన్లో అసభ్యంగా తిట్టి, హత్యాబెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. అదే విధంగా తమ వివాహ రద్దు కేసు కోర్టులో ఉండగా బాలాజి మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా దాడి బాలాజీకి ఫోన్ చేయగా, అతని తాను షూటింగ్ నిమిత్తం వేరే ఊరికి వచ్చానని, తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
రాజకీయాల్లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్
చెన్నై, పెరంబూరు: బిగ్‌బాస్–2 రియాలిటీ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన యువతి నిత్య. ఈమె హాస్యనటుడు, టీవీ యాంకర్ దాడి బాలాజి భార్య అన్నది గమనార్హం. ఈ ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయి కేసులు, కోర్టులు చుట్టూ తిరిగారు. దాడి బాలాజి, నిత్యలకు పోషక అనే ఒక కూతురు ఉంది. కాగా బిగ్‌బాస్–2 రియాలిటీ గేమ్ షోలోనూ వీరిద్దరూ పాల్గొని అక్కడా గొడవలు పడి మరింత సంచలన వ్యక్తులుగా ముద్రవేసుకున్నారు. బిగ్‌బాస్ గేమ్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత నిత్య సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది.ఇటీవల ముంబైలో ప్రారంభించిన నేషనల్ ఉమెన్స్ పార్టీకి నిత్య రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైంది. బుధవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నేషనల్ ఉమెన్స్ పార్టీ అధ్యక్షురాలిగా నిత్య పేరును అధికారికపూర్వకంగా ప్రటించారు. -
నటుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు
సాక్షి, చెన్నై: బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత దాడి బాలాజి, ఆయన భార్య నిత్య ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలాజి నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును నిత్య ఆశ్రయించగా, ఆమెపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు విల్లివాక్కం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. వీరిద్దరితో పాటు విద్యుత్ కార్యాలయ ఉద్యోగి పైసల్‌ను పోలీసులు విచారిస్తున్నారు. బాలాజి, నిత్య మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తలిసిందే. మనస్పర్థల కారణంగా ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలాజి నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో ఇటీవల నిత్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే పైసల్తో నిత్యకు అక్రమ సంబంధం ఉందని బాలాజి ఆరోపించారు. నిత్య ఒక ఎస్ఐ సహాయంలో తనను బెదిరిస్తున్నట్టు పోలీస్‌కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కోర్టు మెట్లెక్కిన నటుడి భార్య
పెరంబూరు: హాస్య నటుడు దాడి బాలాజీ భార్య నిత్య అతని నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించింది. దాడిబాలాజీ బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలాజీకి, అతని భార్య నిత్యకు మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భర్త నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ నిత్య ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత బాలాజీ కూడా కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. తన భార్యను ఒక సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. వారు ఫేస్బుక్ ద్వారా తన భార్యకు పరిచయం అయ్యారని, అప్పటి నుంచి తమ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. తాను భార్యతో కలిసి జీవించడానికి ఆ ఇద్దరు అడ్డు పడుతున్నారని, వారి నుంచి తన భార్యను కాపాడాల్సిందిగా కోరారు. బాలాజీ ఆరోపణలు ఖండించిన నిత్య, బాలాజీ తనకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నాడని మండిపడ్డారు. ఆతని ఆరోపణలతో సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడి కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాను ఇకపై భర్తతో కలిసి జీవించలేనని, అందుకే చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. -
రామయ్యకు వైభవంగా నిత్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి బుధవారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుడి గుడిలో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చుండబెట్టి ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు తెలియజేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. అనంతరం రామయ్యకు ఘనంగా నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రామయ్యకు నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నుంచి తీర్థజలాలను తీసుకువచ్చి భద్రుని ఆలయంలో అభిషేకం నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపానికి వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. అష్టోత్తర శతనామార్చన చేశారు. వేదమంత్రోచ్ఛారణల మ«ధ్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంజనేయస్వామికి అభిషేకం శ్రీసీతారామచంద్రస్వామి వారికి అభిముఖంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న ఆంజనేయస్వామి వారికి మంగళవారం వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం గోదావరి తీర్థ జలాలను తెచ్చి, పంచామృతాలు, నారికేళజలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందన గంధాలను ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. -
మణి మనసు మార్చుకున్నారా?
మణిరత్నం తీసే సినిమాల్లోని హీరో హీరోయిన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటారు. ఆ విధంగా సెలక్ట్ చేయడంలో మణిరత్నం చాలా శ్రద్ధ చూపిస్తారు. మోహన్-రేవతి, కమల్‌హాసన్-శరణ్య, అరవింద్ స్వామి-మధుబాల, జగపతిబాబు-రేవతి, అరవింద్ స్వామి-మనీషా కొయిరాలా, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్... ఇలా మణిరత్నం సినిమాలో నటించిన అన్ని జంటలూ దాదాపు బాగుంటాయి. వాళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జోడీ కూడా కనువిందు చేసింది. అందుకేనేమో ఈ చిత్రం హిందీ రీమేక్‌లో మణిరత్నం వేరే జంటను ఊహించలేకపోతున్నారని సమాచారం. ‘ఆషికీ-2’ ద్వారా హిట్ పెయిర్ అనిపించుకున్న ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లను ఈ రీమేక్‌లో నాయకా నాయికలుగా అనుకున్నారనే వార్త వినిపించింది. కానీ, ఆ తర్వాత మణిరత్నం మనసు మారిందని భోగట్టా. హిందీ రీమేక్‌లో కూడా దుల్కర్, నిత్యాలనే నటింపజేయాలనుకుంటున్నారట. -
వరుణ్ ఉత్తముడట..నేనే అతడి వెంట పడ్డానట!
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... సమయం పన్నెండు దాటింది. గడియారపు ముల్లు పరుగులు తీస్తోంది. ఎక్కడా ఆగకుండా... తడబడకుండా... నిరాటంకంగా సాగిపోతోంది. గంటల్ని నిమిషాలుగా... నిమిషాలను సెకన్లుగా కరిగించేస్తోంది. నిశి రాతిరి నిశ్శబ్దాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చేస్తోంది. నా గుండె ఎందుకో దడదడా కొట్టుకుంటోంది. నా హృదయఘోష నన్ను కలవరపెడుతోంది. నాన్నా! కొన్ని రోజులుగా... కొన్ని వారాలుగా... కొన్ని నెలలుగా నా మనసు ఇలాగే ఘోషిస్తోంది. నన్ను చిత్రవధ చేస్తోంది. నాకు నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తోంది. నా గదిలో... ఒంటరిగా... నాలో నేను పడుతోన్న వేదన మీకు తెలియదు. గుండె గోడల్ని బద్దలు కొట్టుకుని రావాలన్ని ప్రయత్నిస్తోన్న వేదనను నేను ఎంత కష్టపడి అణచుకుంటున్నానో మీ ఎవరికీ అర్థం కాలేదు. మీరందరూ నేను సంతోషంగా ఉన్నాననే అనుకుంటున్నారు. కానీ అది అబద్ధమని, నాదంతా నటన అని మీకు తెలియదు. నా పెదవులపై నవ్వును చూస్తే మీ కళ్లు వెలుగుతాయి. నేను హుషారుగా చిన్న మాట మాట్లాడినా అమ్మ ముఖంలో సంతోషపు పూలు పూస్తాయి. అవి మాయమవ్వకూడదనే నేను నోరు మెదపడం లేదు. నా ఆవేదనను బయటకు చెప్పడం లేదు. కానీ ఈ అంతర్మథనం నన్ను నిలువనీయడం లేదు నాన్నా! అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను. అది మీకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాను. నా దృష్టిలో కాలేజీ అంటే ఏమిటో తెలుసా నాన్నా? కలలను నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలను అందు కోవడానికి, అనుకున్నది సాధించడానికి అందరిన్నీ సమాయత్తం చేసే చోటు. నడవడికను సరిదిద్ది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, మనిషికి మనీషిగా ఎలా ఎదగాలో తెలియజేసే చోటు. కాలేజీలో చేరేవరకూ ఇలాగే అనుకున్నాను. కానీ అది నిజం కాదని కాలేజీలో అడుగు పెట్టాక తెలిసింది. నా కలలు కాలి బూడిదయ్యాక అర్థమయ్యింది. నా జీవితం నరకప్రాయంగా మారిన తరువాత తెలిసివచ్చింది. ముక్కూ ముఖం తెలియని ఓ కుర్రాడు ఉన్నట్టుండి నా ముందుకు వచ్చాడు. నేను తనకి నచ్చానన్నాడు. నా మీద తనకు ప్రేమ పుట్టిందన్నాడు. నాకు నవ్వొచ్చింది. ప్రేమా? అదెలా ఉంటుంది? అంత త్వరగా ఎలా పుడుతుంది? అయినా ప్రేమించుకోవడానికి వేరే స్థలాలు ఉన్నాయి. నేను కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి. మీరు కోరుకున్నట్టుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి. అదే అతనితో చెప్పాను. అర్థం చేసుకుంటాడనుకున్నాను. అడ్డు తప్పుకుంటాడనుకున్నాను. కానీ అడుగడుగునా ముళ్లు పరుస్తాడనుకోలేదు. నేను కాదనగానే వాడిలో వికృతత్వం వేయి తలలు వేసింది. పైశాచికత్వం పరవళ్లు తొక్కింది. వాడి వేధింపులకు నా మనసు బాణం దెబ్బ తిన్న పక్షి పిల్లలా విలవిల్లాడింది. మీరు నన్ను విలువల్ని పంచి పెంచారు నాన్నా! కానీ వరుణ్ని వాళ్ల పేరెంట్స్ డబ్బు పోసి పెంచారు. వాడు అమ్మాయిలను ఏడిపించడానికే కాలేజీకి వస్తాడు. ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వంచించడానికే తాను మగాడిగా పుట్టినట్టు ఫీలవుతాడు. వాడి కన్ను పడిన అమ్మాయి వాడి సొత్తు అంటాడు. ఒంటరిగా దొరికితే తాకరాని చోట తాకుతాడు. అవమానంతో కుంగిపోతుంటే కర్కశంగా నవ్వుతుంటాడు. నా పేరును కాలేజీ గోడలమీదకు చేర్చాడు. తప్పుడు రాతలతో నా పరువును మంట గలిపేశాడు. మీకు చెప్పాలనే అనుకున్నాను. కానీ టెన్షన్ పడతారేమోనని భయమేసి, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాను. దాంతో అంతా ముగిసిపోతుందని అనుకున్నాను. కానీ అది నా కష్టాలకు ఆరంభమని, నా మనశ్శాంతికి అంతమని ఊహించలేకపోయాను. నేను ఇచ్చిన కంప్లయింట్... నా పాలిట మరణ శాసనమయ్యింది నాన్నా! ఆ రోజు నుంచీ నా జీవితం పూర్తిగా మారిపోయింది. వాడు డబ్బులే తినిపించాడో, పలుకుబడితో పని కానిచ్చాడో తెలియదు కానీ... యాజమాన్యం వాడికి కాపలా కాయడం మొదలుపెట్టింది. వాడిని కాపాడుకోవడం కోసం నన్ను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. వాడు నన్ను నీడలా వెంటాడుతుంటే, పీడకలలా వేధిస్తూ ఉంటే పట్టనట్టు ఊరుకుంది. ఏమిటీ అన్యాయం అని అడిగినందుకు నన్ను పరిపరివిధాల అవమానించింది. నేను తప్పుడు ఫిర్యాదు చేశానట. ఆ వరుణ్ ఉత్తముడట. నేనే అతడి వెంటపడ్డానట. అతడు కాదంటే కసితో కంప్లయింట్ ఇచ్చానట. ఏవేవో అన్నారు నాన్నా! చెప్పరాని నిందలు వేశారు నాన్నా! మాటలతో నా గుండెలను తూట్లు పొడిచారు నాన్నా! అప్పుడైనా మీకు చెబుదామనుకున్నాను. కానీ చెప్పలేని పరిస్థితి. వరుణ్ కోటీశ్వరుడైన తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి మన కుటుంబాన్ని నాశనం చేస్తాడట. అందుకే నోరు మూసుకుని ఉండ మన్నారు. అలా చెప్పింది ఎవరో తెలుసా నాన్నా! సాక్షాత్తూ మా ప్రిన్సిపల్. నా పరువు ఎలాగూ పోయింది. నా జీవితం ఎలాగూ నాశనమైపోయింది. మిమ్మల్ని కూడా ఎందుకు నాన్నా కష్టాల్లోకి లాగడం! నేనేమై పోయినా ఫర్వాలేదు. కానీ మీరు, అమ్మ పదిమందిలో తల దించుకోకూడదు నాన్నా! అందుకే మౌనాన్ని ఆశ్రయించాను. మౌనంగానే అన్నిటినీ సహించాను. కానీ ఇక నా వల్ల కాదు. క్షణక్షణం బతుకు భారమవు తోంది. ప్రతిక్షణం భయంతో గుండె గుబగుబలాడుతోంది. నవ్వడమే మర్చిపోయాను. మీ దగ్గర నటించ డానికి మాత్రమే నా పెదవులు విచ్చుకుంటున్నాయి. మిమ్మల్ని సంతోష పెట్టడానికి మాత్రమే నా కళ్లు కాంతుల్ని కొని తెచ్చుకుంటున్నాయి నాన్నా! నిజానికి నా కనురెప్పల మాటున కడవల కొద్దీ కన్నీళ్లు దాగివున్నాయి. వాటిని మీ ముందు రాల్చే ధైర్యం కూడా చేయలేని నిస్సహాయురాలినయ్యాను. ఇక ఈ నరకయాతనను నేను భరించలేను. కల్లలైపోయిన కలల్ని ఏరుకునే ప్రయత్నం చేయలేను. ముక్కలైపోయిన హృదయానికి అతుకులు వేస్తూ బతుకు సాగించలేను. అందుకే వెళ్లిపోతున్నాను. అపవాదులు, అపనిందలు లేని చోటుకు వెళ్లిపోతున్నాను. ఎవరూ వేధించని, వేలెత్తి చూపించని చోటికి పయనమైపోతున్నాను. మీ ఆశల్ని మంటగలిపి, మీ కలల్ని కాలరాసి, నా ఈ మరణలేఖను మీకు మిగిల్చి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్నా... వీలైతే నన్ను క్షమించండి. శెలవ్. ప్రేమతో మీ కూతురు నిత్య (పేరు మార్చాం) (మృతురాలి గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఆత్మహత్య చేసుకోవడమనే నిర్ణయం అంత తేలికగా తీసుకునేది కాదు. నిరాశ ఎక్కువై, నిస్సహాయంగా ఫీలయ్యి, ఇక ఎవరూ తన సమస్యను పరిష్కరించ లేరు అనిపించినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకే ‘సూసైడ్ ఈజ్ ఎ క్రై ఫర్ హెల్ప్’ అంటుంటాం. పాపం ఈ అమ్మాయి కూడా అలాంటి స్థితిలోనే ఆ నిర్ణయం తీసుకుని ఉండాలి. చెడ్డ పేరు వస్తుందని, తల్లిదండ్రులు అవమానంగా ఫీలవుతారని ఆలోచించి ఉంటుంది. నిజానికి ఆత్మహత్య ఆలోచనలు కలవారిలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒత్తిడికి లోనవడం, ఊరికే కోపం తెచ్చుకోవడం, వస్తువులు పగులగొట్టడం వంటివి చేస్తుంటారు. కొందరు డల్ అయిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఊరికే దుఃఖపడు తుంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారితో మాట్లాడి, మేమున్నా మనే ధైర్యాన్ని కల్పించాలి. పరిస్థితి చేయి దాటినట్టనిపిస్తే డాక్టర్‌కి చూపించాలి. ఈ లక్షణాలను గుర్తించడంలో విఫలమైతే మాత్రం... ఇలాంటి ఘటనలను ఆపడం కష్టం! -
ఎన్నెన్నో వర్ణాల హరివిల్లు
ప్రేమించుకున్న మనుషులు దూరమైనా.. మనసులు మాత్రం కలిసే ఉంటాయని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఓనమాలు’ ఫేం క్రాంతిమాధవ్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘మనసుల్ని మెలిపెట్టే పరిణతి చెందిన ప్రేమకథాచిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని హృద్యంగా తెలియజెప్పాడు దర్శకుడు. సాహితి రచించిన ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే...’ అనే పల్లవితో సాగే పాటకు స్వర్ణ మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చగా, పాండిచ్చేరిలో హీరోహీరోయిన్లపై చిత్రీకరించాం. దీంతో షూటింగ్ పూర్తయింది. నిత్యామీనన్, శర్వానంద్‌ల జంట యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం, గోపీసుందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి అతి త్వరలో పాటల్ని, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
నమిత నటనకు స్వస్తి చెప్పాలి
నటి నమిత చిత్రరంగానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పి వెళ్లిపోవాలంటూ బహిరంగ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు వర్దమాన నటి నిత్య. త్వరలో తాను రాజకీయ ప్రవేశం చేయనున్నానని, మూడు పార్టీల నుంచి ఆహ్వానం అం దిందంటూ నమిత ఇటీవల పేర్కొన్న విషయం తెలి సిందే. ఎన్నికల బరిలోకి అనేక మంది తారలు వెంటనే దిగినప్పటికీ నమిత మాత్రం తాను ఏ పార్టీలో చేరనున్నదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘సాయిందాడు సాయిం దాడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు నటి నిత్య. పుదుక్కోట్టైలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారు. అక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ నమిత నటనకు స్వస్తి చెప్పాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెబుతున్న ఆమె ఇంకా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీరు ఈ విధంగా మాట్లాడడం నమితకు తెలిస్తే కోప్పడుతుందిగా అంటూ మీడియా రెచ్చగొట్టగా, తనను ఒకసారి నేరుగా చూస్తే ఆమెకు కోపం రాదని, ఎందుకంటే తనను అందరూ ‘చిన్న నమిత’ అంటూ ముద్దు గా పిలుస్తున్నారని తెలిపారు. చివరిగా నమితను నేరుగా చూడాలన్న ఆసక్తితో ఉన్నానంటూ సమాధానమిచ్చారు.