
చెన్నై, పెరంబూరు: బిగ్‌బాస్–2 రియాలిటీ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన యువతి నిత్య. ఈమె హాస్యనటుడు, టీవీ యాంకర్ దాడి బాలాజి భార్య అన్నది గమనార్హం. ఈ ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడిపోయి కేసులు, కోర్టులు చుట్టూ తిరిగారు. దాడి బాలాజి, నిత్యలకు పోషక అనే ఒక కూతురు ఉంది. కాగా బిగ్‌బాస్–2 రియాలిటీ గేమ్ షోలోనూ వీరిద్దరూ పాల్గొని అక్కడా గొడవలు పడి మరింత సంచలన వ్యక్తులుగా ముద్రవేసుకున్నారు. బిగ్‌బాస్ గేమ్ షో నుంచి బయటకు వచ్చిన తరువాత నిత్య సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది.ఇటీవల ముంబైలో ప్రారంభించిన నేషనల్ ఉమెన్స్ పార్టీకి నిత్య రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైంది. బుధవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నేషనల్ ఉమెన్స్ పార్టీ అధ్యక్షురాలిగా నిత్య పేరును అధికారికపూర్వకంగా ప్రటించారు.
Comments
Please login to add a commentAdd a comment