నమిత నటనకు స్వస్తి చెప్పాలి | I'm the new Namitha of Tamil films, claims upcomeing actress Nithya | Sakshi
Sakshi News home page

నమిత నటనకు స్వస్తి చెప్పాలి

Published Thu, Mar 27 2014 8:25 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

నమిత నటనకు  స్వస్తి చెప్పాలి - Sakshi

నమిత నటనకు స్వస్తి చెప్పాలి

నటి నమిత చిత్రరంగానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పి వెళ్లిపోవాలంటూ బహిరంగ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు వర్దమాన నటి నిత్య. త్వరలో తాను రాజకీయ ప్రవేశం చేయనున్నానని, మూడు పార్టీల నుంచి ఆహ్వానం అం దిందంటూ నమిత ఇటీవల పేర్కొన్న విషయం తెలి సిందే. ఎన్నికల బరిలోకి అనేక మంది తారలు వెంటనే దిగినప్పటికీ నమిత మాత్రం తాను ఏ పార్టీలో చేరనున్నదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘సాయిందాడు సాయిం దాడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు నటి నిత్య.

పుదుక్కోట్టైలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ నమిత నటనకు స్వస్తి చెప్పాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెబుతున్న ఆమె ఇంకా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీరు ఈ విధంగా మాట్లాడడం నమితకు తెలిస్తే కోప్పడుతుందిగా అంటూ మీడియా రెచ్చగొట్టగా, తనను ఒకసారి నేరుగా చూస్తే ఆమెకు కోపం రాదని, ఎందుకంటే తనను అందరూ ‘చిన్న నమిత’ అంటూ ముద్దు గా పిలుస్తున్నారని తెలిపారు. చివరిగా నమితను నేరుగా చూడాలన్న ఆసక్తితో ఉన్నానంటూ సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement