pudukkottai
-
రంజితమే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన కలెక్టర్.. వైరలవుతోన్న వీడియో
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, రష్మిక మందన నటించిన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రంలోని రంజితమే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్‌కు అనేకమంది రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి తమ టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా రంజితమే పాటకు ఏకంగా ఓ కలెక్టర్ డ్యాన్స్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లాల్సిందే.. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో జిల్లా కలెక్టరేట్లో వుమెన్స్ డేను సంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో కలెక్టర్, ఇతర ఉద్యోగులతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు. అనంతరం వేదికపై ప్లే చేసిన పాటలకు పలువురు నృత్యాలు చేశారు. ఇదే క్రమంలో కలెక్టర్ కూడా డ్యాన్స్ చేయాలని కోరడంతో దళపతి విజయ్ హీరోగా నటించిన వారిసు మూవీలోని రంజితమే అనే సాంగ్‌కు అద్బుతంగా డ్యాన్స్ చేశారు. ఇతర మహిళా అధికారులతో కలిసి అచ్చం రియల్ పాటలో మాదిరిగా ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కలెక్టర్ డ్యాన్స్‌పై సూపర్ మేడమ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Pudukkottai collector Kavitha Ramu @kavitharamu dances to 'Ranjithame' song along with other women officials, as a part of International #WomensDay celebrations at the district collectorate on Friday. @xpresstn pic.twitter.com/qRaSW2F9Ho — Iniya Nandan (@Iniyanandan25) March 10, 2023 -
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్‌ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్‌ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!
సాక్షి, చెన్నై: పెళ్లైన కొద్ది రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. పుదుకోట్టై జిల్లా అరంతాంగి తాలూకా పెరుమాల్పట్టికి చెందిన సురేష్‌కు (30). ఆవుడయార్ కోయిల్ సమీపం పెరియవీర మంగళంలకు చెందిన ఉష (22)తో గత 40 రోజుల క్రితం వివాహమైంది. ఆషాడం నెలను పురస్కరించుకుని ఉషను ఆమె తల్లిదండ్రులు వారి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఈజెల 17వ తేదీ భార్యను చూడడానికి సురేష్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఉష అన్న ఉలగనాథన్ విదేశాలకు వెళ్లడానికి సిద్ధం కావడంతో అతనికి కావలసిన వస్తువులు తీసుకురావడానికి ఉష, సురేష్, ఉష తల్లి అరంతాంగికి వెళ్లిసాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. తరువాత తాను అరంతాంగికి వెళుతున్నానని భార్యకు చెప్పి సురేష్ బయటకు వెళ్లాడు. తరువాత రాత్రి 8 గంటలకు ఉష భర్తకు ఫోన్‌చేయగా తాను ఉదయం ఇంటికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉష ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టుకు సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆవుడయార్ కోవిల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సరేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు అరంతాంగి ప్రభుత్వాస్పత్రిని ముట్టడించారు. అధికారులు వారితో సమాధానం మాటలు మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తూ వున్నారు. -
‘మరో బిడ్డను కనే అర్హత లేదు’
ఓ వైపు తూత్తుకుడి జిల్లాలో తండ్రి కోడుకుల జయరాజ్, బెనిక్స్ కస్టోడియల్ మరణాల పట్ల నిరసనలు కొనసాగుతుండగానే తమిళనాడులోని పుదుకొట్టాయ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై మృగాళ్లు పైశాచికంగా దాడి చేసి చంపేసిన ఘటన పట్ల ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రెండు రోజుల క్రితం తప్పిపోయిన బాలిక అత్యాచారానికి గురయ్యి దారుణంగా హత్యగావింపడింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, నెటిజనులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో నటి సాయి పల్లవి కూడా ఉన్నారు. (అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం) The hope in human race is deteriorating at such a fast pace. We misuse power that’s given to help the voiceless. We hurt ppl whom we find weaker. And we kill babies to satisfy our monstrous pleasures. — Sai Pallavi (@Sai_Pallavi92) July 3, 2020 ‘బలహీనులకు సాయం చేయడానికి ఇచ్చిన శక్తిని మేము దుర్వినియోగం చేస్తూ బలహీనులను బాధపెడతాము. మా రాక్షసానందం కోసం చిన్నారులను బలి తీసుకుంటాము. ఈ ఘటనలతో మానవజాతిపై ఆశ అత్యంత వేగంగా దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు ప్రకృతి మనకో విషయం చెప్తుంది. మన జాతి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తు చేస్తోంది. ఈ అన్యాయాలు చూడటానికే మనం ఇంత దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. పనికిరాని జీవితం. చిన్నారులను కాపాడలేకపోతున్నాం.. కనుక మరో బిడ్డను ఈ రాక్షసలోకంలోకి తీసుకు వచ్చే అర్హత కోల్పోయాం. ఓ దారుణం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినప్పుడు లేదా మీడియాలో ప్రచారం జరిగినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని కోరుకుంటున్నాను. మరి మనం గమనించని, పట్టించుకోని నేరాల విషయంలో ఏం చేద్దాం’ అంటూ సాయి పల్లవి వరుస ట్వీట్లు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. With every passing day it looks like nature is telling us that our race needs to be wiped clean, for living such a pathetic life where we watch such incidents happen but still be so useless!!! This inhumane world doesn’t deserve to birth another Child ! — Sai Pallavi (@Sai_Pallavi92) July 3, 2020 తమిళనాడు పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన ఏడేళ్ల జయప్రియ రెండో తరగతి చదువుతుంది. జూలై ఒకటో తేదీ అంటే బుధవారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. రాత్రి అయినా తిరిగిరాలేదు. అర్థరాత్రి సమయంలో తల్లిదండ్రులు బంధువులు, చుట్టాలు, జయప్రియ స్నేహితుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ క్రమంలో గ్రామం చివర.. ముళ్ల పొదళ్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టంలో చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు నిర్థారణ అయ్యింది. దాంతో తమిళనాట ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో హోరెత్తిస్తూ ఆమెకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు -
హైటెన్షన్
► వెల్లువెత్తుతున్న నిరసనలు ► విస్తరిస్తున్న ఉద్యమం ► నేడు పుదుక్కోట్టైలో దుకాణాల మూత సహజ వాయువుల నిక్షిప్త సేకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకంపై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రోకార్బన్ పథకం ఆపివేయాలనే డిమాండ్‌పై నిరసనకారుల దండయాత్రతో పుదుక్కోట్టై జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. గత 14 రోజులుగా సాగుతున్న పోరాటం మంగళవారం తీవ్రస్థాయికి చేరింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : పుదుక్కోట్టై జిల్లా నెడువాసల్ గ్రామం నుంచి సహజవాయువుల నిక్షిప్తాన్ని సేకరించేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు గ్రామ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. సహజవాయువుల కోసం కేంద్రం జారీ చేసిన ఉత్తరు్వలను ఉపసంహరించాల్సిదిగా కోరుతూ ఈనెల 16 నుంచి ప్రజలు నిరసన పోరాటాలు సాగిస్తున్నారు. నెడువాసల్ నాడియమ్మన్ ఆలయం మధ్యలో షెడు్డను ఏర్పాటు చేసుకుని గ్రామ ప్రజలు సమష్టిగా ఆందోళనలు జరుపుతున్నారు. ఈ ఆందోళనలకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థి సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి పోరా టం ఉగ్రరూపం దాల్చింది. సుమారు వంద గ్రామాలకు చెందిన ప్రజలు అభిప్రాయసేకరణ నిర్వహించగా ఏకగ్రీవంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. గ్రామసభలను నిర్వహించి 11 తీర్మానాలను ఆమోదించారు. ఈ పథకాన్ని కేంద్రం ఉపసంహరించే వరకు రోజూ ఒక్కో గ్రామానికి చెందిన ప్రజలు నిరసన శిబిరంలో కూర్చోవాలని, హైడ్రోకార్బన్ పథకంపై నిరసన వ్యక్తం చేస్తూ గ్రామాలో్లని అన్ని ఇళ్లపై నల్లజెండాలను ఎగరవేయాలని, అన్ని గ్రామాల్లో సభలను నిర్వహించి తీర్మానాలు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని, నెడువాసల్ నుంచి పుదుక్కోట్టై జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మానవహారం నిర్మించాలని, పర్యావరణ శాఖపై పిటిషన్ వేయాలని, తమిళనాడు ఎంపీలంతా పార్లమెంటులో నిరసన గళం వినిపించాలని, కావేరీ డెల్టా జిల్లాలను ఒకటిచేసి వ్యవసాయ రక్షణ మండలంగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని పలు తీర్మానాలు చేశారు. అంతేగాక, నెడువాసల్ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తమ రేషన్, ఓటరు, ఆధార్ కారు్డలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అప్పగించాలని, యువతీ యవకులు, విద్యారు్థలు జిల్లా కేంద్రాన్ని ముట్టడించాలని, అన్ని ఇళ్ల వద్ద దివిటిలను వెలిగించి పోరాట స్ఫూర్తిని కలిగించాలనే తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల ప్రకారం మంగళవారం కరంపకుడి, ఆలంగుడి, సుందరపేట్టై తదితర వంద గ్రామాల్లో అన్ని ఇళ్లపై నల్లజెండాలను ఉంచారు. చెనై్నలో జల్లికట్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు తదితర జిల్లాలకు చెందిన యువత, విద్యారు్థలు, రైతులు నెడువాసల్ గ్రామానికి చేరుకోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామంలోకి ప్రవేశించే అన్ని దారుల వద్ద పోలీసులు తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ఉద్యమకారులను అడు్డకుంటున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేసి మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘం ప్రకటించింది. హైడ్రోకార్బన్ పథకం కారైక్కాల్‌లో సైతం అమలు చేసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలు ఉద్యమానికి ఉద్యుకు్తలవుతున్నారు. టీవీ నటి సోనియాబోస్ వెంకట్ ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ పథకంపై కేంద్రం వెనక్కు తగ్గకుంటే మెరీనాబీచ్ వద్ద జల్లికట్టు తరహా ఉద్యమం నిర్వహిస్తామని యువజన సంఘాలు హెచ్చరించాయి. గ్యాస్‌పైపు నుంచి మంటలు : హైడ్రోకార్బన్ పథకం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని కేంద్రం ఓ వైపు నమ్మబలుకుతుండగా మంగళవారం చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది. నెడువాసల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని వానక్కంగాడు గ్రామంలో పరిశోధన కోసం అమర్చిన సహజవాయువు పైప్ నుంచి మంగళవారం మంటలు చెలరేగాయి. సమీపంలోని గ్రామస్తులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. -
నమిత నటనకు స్వస్తి చెప్పాలి
నటి నమిత చిత్రరంగానికి శాశ్వతంగా గుడ్‌బై చెప్పి వెళ్లిపోవాలంటూ బహిరంగ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు వర్దమాన నటి నిత్య. త్వరలో తాను రాజకీయ ప్రవేశం చేయనున్నానని, మూడు పార్టీల నుంచి ఆహ్వానం అం దిందంటూ నమిత ఇటీవల పేర్కొన్న విషయం తెలి సిందే. ఎన్నికల బరిలోకి అనేక మంది తారలు వెంటనే దిగినప్పటికీ నమిత మాత్రం తాను ఏ పార్టీలో చేరనున్నదీ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘సాయిందాడు సాయిం దాడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు నటి నిత్య. పుదుక్కోట్టైలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారు. అక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ నమిత నటనకు స్వస్తి చెప్పాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లోకి ఆహ్వానించినట్లు చెబుతున్న ఆమె ఇంకా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మీరు ఈ విధంగా మాట్లాడడం నమితకు తెలిస్తే కోప్పడుతుందిగా అంటూ మీడియా రెచ్చగొట్టగా, తనను ఒకసారి నేరుగా చూస్తే ఆమెకు కోపం రాదని, ఎందుకంటే తనను అందరూ ‘చిన్న నమిత’ అంటూ ముద్దు గా పిలుస్తున్నారని తెలిపారు. చివరిగా నమితను నేరుగా చూడాలన్న ఆసక్తితో ఉన్నానంటూ సమాధానమిచ్చారు.