
మహనటితో తెలుగులోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ త్వరలోనే మరో తెలుగు సినిమాకు సైన్ చేశాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్ బాలీవుడ్ చిత్రం ‘జోయా ఫ్యాక్టర్’తో బిజీగా ఉన్నారు. త్వరలోనే టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి యుద్ధ నేపధ్యంలో సాగే చిత్రంలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో, నూతన దర్శకుడి దర్శకత్వంలో మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర దర్శకుడు వెంకీ, దుల్కర్‌లని పలుమార్లు కలిసాడని, కథ గురించి వారికి వివరించినట్లు సమాచారం. అయితే దీని గురించి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment