
షాలినీ పాండే... ఇప్పుడు హాట్ టాపిక్. టీ టౌన్ అదేనండీ.. మన టాలీవుడ్... కో టౌన్ అంటే.. కోలీవుడ్‌లో షాలినీ పాండేకి బోలెడంత క్రేజ్. ఆ క్రేజ్ అంతా ‘అర్జున్ రెడ్డి’ తెచ్చిందే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా హిట్‌తో షాలినీ పాండేకి ఓవర్ నైట్ ఫుల్ పాపులార్టీ వచ్చేసింది. ఇటు తెలుగులో కాకుండా అటు తమిళ పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘100% పర్సంట్’ తమిళ రీమేక్ ‘100% కాదల్’లో నటిస్తున్నారు. ఇటు తెలుగులో ‘మహానటి’లో యాక్ట్ చేస్తున్నారు.
తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఓ సినిమాకి అవకాశం వచ్చిందట. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో షాలినీ పాండేని కథానాయికగా అడిగారట. ‘ఓకే బంగారం’తో దుల్కర్‌కి తెలుగు, తమిళంలో మంచి పేరొచ్చింది. ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర చేస్తున్నారు. ఇదే చిత్రంలో షాలినీ కూడా నటిస్తున్నారు. కాకపోతే జోడీగా కాదు. సో... ద్విభాషా చిత్రానికి షాలిని ఓకే చెబితే.. ఈ ఇద్దరినీ జంటగా చూడొచ్చు. మరి.. ‘ఓకే బంగారం’ అంటారా? అనే క్వొశ్చన్ అవసరం లేదేమో. ఎందుకంటే, షాలిని పచ్చజెండా ఊపేస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment