క్లాప్‌.. క్లాప్‌ | Akhil Akkineni 3rd Movie Launch | Sakshi
Sakshi News home page

క్లాప్‌.. క్లాప్‌

Published Tue, Mar 27 2018 12:04 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Akhil Akkineni 3rd Movie Launch - Sakshi

అఖిల్, నాగార్జున

‘హలో’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు అఖిల్‌. తొలి సినిమా ‘తొలిప్రేమ’తోనే సూపర్‌ హిట్‌ సాధించారు దర్శకుడు వెంకీ అట్లూరి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది.

దేవుని పటాలకు నమస్కరిస్తున్న అఖిల్‌పై తీసిన తొలి షాట్‌కి నాగార్జున క్లాప్‌ ఇచ్చారు. హీరో దుల్కర్‌ సల్మాన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మేలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జార్జి సి. విలియమ్స్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement